English | Telugu

బాలయ్య షోకి గెస్ట్ గా బ్రహ్మి.. ఇదీ అసలుసిసలు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే! 

'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే' షోతో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ అంచనాలకు మించి అలరిస్తున్న సంగతి తెలిసిందే. మనసుకి అనిపించింది ఓపెన్ గా మాట్లాడుతూ, తనదైన కామెడీ టైమింగ్ తో బాలయ్య మెప్పిస్తున్నారు. అయితే ఈ షోలో మూడో ఎపిసోడ్ లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో కలిసి బాలయ్య వినోదాన్ని పంచనున్నారని ప్రచారం జరుగుతోంది.

'అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే' షో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు వచ్చారు. అలాగే మంచు విష్ణు, లక్ష్మి కూడా ఈ ఎపిసోడ్ లో మెరిసారు. ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీతో కలిసి బాలయ్య అందించిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 12 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షో మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా బ్రహ్మనందాన్ని రంగంలోకి దింపారని తెలుస్తోంది.

బ్రహ్మానందం కామెడీ కింగ్. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే పెదాలపై నవ్వు చిగురిస్తుంది. ఆయన్ని మీమ్ గాడ్ అని కూడా అంటారు. ఆయన స్క్రీన్ పై ఇచ్చిన ఎన్నో ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ గా వైరల్ అవుతుంటాయి. అలాంటి బ్రహ్మి.. బాలయ్య షోకి వస్తే ఫన్ ఏ రేంజ్ లో ఉంటుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. బాలయ్య- బ్రహ్మి కలిస్తే మాత్రం 'అన్‌స్టాపబుల్‌ ఫన్' పక్కా. మరి బ్రహ్మి నిజంగానే బాలయ్య షోకి వచ్చి సందడి చేస్తారేమో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.