English | Telugu

Srija Dammu Buzz interview: శ్రీజ చెప్పిన షాకింగ్ నిజాలివే!

బిగ్ బాస్ సీజన్-9 లో మునెప్పుడు లేని విధంగా వైల్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఫ్లోరా సైనీ, దమ్ము శ్రీజ ఇద్దరిని ఇంటికి పంపించేశాడు బిగ్ బాస్.

అయితే శ్రీజ ఎలిమినేషన్ ని అందరు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. ఎందుకంటే ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి ఓటింగ్ లో చివరగా ఉండగా మొదటగా ఫ్లోరాని ఎలిమినేషన్ చేశారు. ఆ తర్వాత ఉన్న రీతూని ఎలిమినేషన్ చేయాలి కానీ రీతూని వదిలేసి శ్రీజని ఎలిమినేట్ చేశారు. ఇక హౌస్ లో టాస్క్ పెట్టగా అందులో సుమన్ శెట్టి, శ్రీజ ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలో వైల్డ్ కార్డ్స్ ని అడగడం.. వారి నిర్ణయంతో శ్రీజని ఎలిమినేషన్ నిజంగా అన్ ఫెయిర్. సుమన్ శెట్టికి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ బిగ్ బాస్ చేసిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎవరికి నచ్చలేదు. ఇక ఎలిమినేషన్ అయి బయటకొచ్చిసిన శ్రీజ.. బజ్ ఇంటర్వ్యూలో కొన్ని నమ్మలేని నిజాలు చెప్పింది.

ఇక శ్రీజ వచ్చీరాగానే శివాజీ హై పిచ్ లో మాట్లాడాడు. ఎవరికో ఫోన్ చేసినట్టుగా చేసి.. గట్టి గట్టిగా వాగాడు. ఆ తర్వాత ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది శ్రీజ అని అడిగాడు. బాగోలేదని శ్రీజ అంటుంది. కదా మరి ఎందుకు అలా అరుస్తావని శివాజీ అడిగాడు. బేసికల్లీ నా వాయిసే అంత సర్.. కానీ చాలా తగ్గించానని శ్రీజ అంది. కామనర్స్, సెలబ్రిటీస్ అని బాగా మనసులో పెట్టేసుకున్నావ్.. నువ్వు మైనస్ కావడానికి కారణమే అది అని శివాజీ అనడంతో.. నేను ఒక్కసారే ఆ మాట అన్నాను. ఒక మనిషిని పట్టుకుని నువ్వు నెగిటివ్.. నెగిటివ్.. నువ్వు ఎవరికి సెట్ కావు.. నీతో మాట్లాడం అని అంటుంటే ఆటోమేటిక్‌గా డౌన్ అవుతాం కదా.. నేను ఒక గ్రూప్ దగ్గర కూర్చున్నానంటే.. అసలు వాళ్లు నా దగ్గర ఉండేవాళ్లు కాదు. వెళ్లిపోయేవారని చెప్పింది. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడే తనకి డీమాన్ పవన్ ఆ విషయం చెప్పాడని చెప్పింది. కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నాడంటూ శ్రీజ చెప్పడంతో.. హో.. ప్లాన్‌గా డీమాన్ పవన్ లవ్ యాంగిల్ జరుపుతున్నాడా అని శివాజీ షాక్ అయ్యాడు. ఇక చివర్లో దమ్ముంటే టచ్ చేయి అని అన్నప్పుడు..నీ నోరు ఎందుకు మాట్లాడుతుంది.. చేయి కదా మాట్లాడాలని శివాజీ అంటాడు. ఇక రీతూ చౌదరి, డీమాన్ పవన్ ఇద్దరు లవ్ ట్రాక్ కోసమే ఉన్నారని, భరణి దుమ్ము ప్లేయర్ అని, ఇమ్మాన్యుయల్ దమ్మున్న ప్లేయర్ అని శ్రీజ అంది. ఇలా ఎవరు దమ్ము, ఎవరు దుమ్ము కంటెస్టెంట్ అని శ్రీజ చెప్పుకొచ్చింది. మరి బజ్ ఇంటర్వ్యూలో దమ్ము శ్రీజ మాట్లాడిన మాటలు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.