English | Telugu

మేము వస్తే ఈ స్టేజీకే కల వచ్చింది..మీరు వస్తే ఈ స్టేట్ కి కళొచ్చింది సర్

ఈ దీపావళికి మాస్ జాతర పేరుతో అక్టోబర్ 20 న ఒక ప్రొగ్రమ్ రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "ఏదేమైనా శేఖర్ నువ్వొచ్చాక ఈ స్టేజికి అద్భుతమైన కళ వచ్చింది" అంటూ నాగబాబు శేఖర్ మాష్టర్ ని పొగిడేసాడు. వెంటనే శేఖర్ కూడా "మేమొస్తే ఈ స్టేజీకే కళ వచ్చిందేమో మీరొస్తే ఈ స్టేట్ కె కళొచ్చింది సర్" అని చెప్పాడు. ఇక ఆది వచ్చి శేఖర్ మాష్టర్ కి, నాగబాబు కొత్త వస్త్రాలున్న పాక్స్ ని ఇచ్చాడు. శేఖర్ మాష్టర్ ఐతే ఆ పాక్ చూసి "ఈ కలర్ బాబు గారికి సెట్ అవుతుంది.

నువ్వు వెళ్లి ఇది చెప్పి ఆ కవర్ తీసుకుని ఈ కవర్ ఇచ్చేయి" అని చెప్పాడు. అదే విషయాన్నీ ఆది వెళ్లి నాగబాబుకు చెప్పాడు. "బాబు గారు ఈ కవర్ శేఖర్ మాష్టర్ కి ఇచ్చేద్దాం అడుగుతున్నాడు" అన్నాడు. "అడగటానికి ఆడేవాడు..చెప్పడానికి నువ్వు ఎవడవురా" అన్నారు నాగబాబు. "నేనొక జడ్జిగా చెప్తున్నా ఈ కలర్ నీకు బాగుంటుంది" అంటూ నాగబాబు చెప్పారు. "నేను కూడా జడ్జ్ గానే చెప్తున్నా సర్ ఈ కలర్ మీకు బాగుంటుంది" అన్నాడు. "జడ్జ్మెంట్ వరకు వచ్చావంటే నువ్వు బెటర్ జడ్జ్ ఆ, నేను బెటర్ జడ్జ్ ఆ తేల్చుకుందాం ఈరోజు" అంటూ పందెం కాసుకున్నారు. "తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం సర్" అంటూ శేఖర్ మాష్టర్ దాక్కునే సరికి.."తేల్చుకుందాం అంటూ వెనక్కి వెళ్తున్నావేంటి" అంటూ నాగబాబు అడిగారు. "ఏంటి సర్ ముందుండే తేల్చుకోవాలి ఏంటి దూరం నుంచి తేల్చుకోకూడదా ఏంటి" అంటూ కౌంటర్ వేసాడు శేఖర్ మాష్టర్. అలా ఇద్దరూ వాళ్ళ వాళ్ళ పాక్స్ ని విసిరిగొట్టి తేల్చుకుందాం పదా అనుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.