English | Telugu

Duvvada Madhuri Wildcard entry: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ జోరు సాగింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీనీ బిగ్ బాస్ చాలా వైల్డ్ గా ప్లాన్ చేసాడు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంటే బిగ్ బాస్ లోని పాత కంటెస్టెంట్స్ కి వణుకుపుట్టింది. మూడవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ పొలిటిషన్ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్యగా దువ్వాడ మాధురి ఫుల్ వైరల్ అయింది. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్న దువ్వాడ మాధురి భారీ అంచనలా మధ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

దువ్వాడ మాధురి స్టేజ్ పైకి వచ్చింది. తను వచ్చీరాగానే 'AV(ఏవి)' ప్లే చేసాడు నాగార్జున. ఇక ఆ తర్వాత తన గురించి చెప్తుంది. హౌస్ లో ఎవరంటే ఇష్టమని నాగార్జున అడుగగా.. ఎవరు ఇష్టం లేదని చెప్తుంది. హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి ఏం చెప్తారని నాగార్జున అడుగగా.. హౌస్ లోకి బాండింగ్ పెట్టుకోవడానికి వెళ్తారు కొందరు.. ఇప్పుడు కప్ ఒక్కరికే వస్తుంది కదా ఇవన్నీ బంధాలు పెట్టుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ కప్ తీసుకోలేం కదా అని మాధురి అనగానే మీరు ఇప్పుడు ఒక బంధంతోనే కదా ముందుకి వెళ్తుందని నాగార్జున కౌంటర్ వేస్తాడు. అది జీవితం.. ఇది గేమ్ అని మాధురి కవర్ చేస్తుంది. శ్రీనివాస్ కోసం ఏదైనా చేస్తాను తను ఉండిపొమ్మంటే ఉండి పోయేదాన్ని కానీ వెళ్ళు నేను పిల్లల్ని చూసుకుంటానని ధైర్యంగా పంపాడని అంది. వారిద్దరి గురించి చాలా గర్వంగా, గొప్పగా చెప్పుకుంది మాధురి.

కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చ సుదీప్ ఒక సూపర్ పవర్ పంపించాడు. మాధురికి ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. అదేంటంటే ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్. ఆ తర్వాత మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక అందరిని పరిచయం చేసుకుంటుంది దువ్వాడ మాధురి. ఇక అప్పుడే మీ పేరు ఏంటని శ్రీజ అడుగుతుంది. నా పేరు తెలియదా అని మాధురి రూడ్ గా మాట్లాడుతుంది. అదేంటి అలా అడగడం తప్పా, నాకు తెలియదు కాబట్టి అడిగా అని శ్రీజ అంటుంది. రావడంతోనే గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నావా అని మాధురి అంటుంది. దువ్వాడ మాధురి బిహేవియర్ తో పాత కంటెస్టెంట్స్ కి భయం మొదలైంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.