English | Telugu
వీజే సన్నీపై డైలాగ్ లతో రెచ్చిపోయిన ఆడపులి!
Updated : Jul 20, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి క్రేజ్ మామూలుగా లేదు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడంతో ఈ బ్యూటీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అదే పాపులారిటీతో సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా స్టార్ మాలో ఓ స్పోషల్ సందడి చేసింది. `బిగ్ బాటిల్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ పేరుతో ఈ ఆదివారం ప్రత్యేక షోని స్టార్ మా ప్లాన్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాల్గొనే ఈ షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమోలో బిందు మాధవి డైలాగ్ లతో రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. `ఒక కింగ్ మరో కింగ్ ని గెలవడానికి వెళితే యుద్ధం. అదే క్వీన్ కింగ్ పై గెలవడానికి వెళితే అదే పెద్ద యుద్ధం` అంటూ యాంకర్ రవి హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ని రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ కింగ్ గా, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ క్వీన్ గా ఈ షోలో పోటీపడబోతున్నారు. `కాంపిటీషన్ అంటే మా స్టాండర్డ్స్ లో వుండే వాళ్లు కావాలి. వీళ్లతో పోటీ ఏంటబ్బా` అని సన్నీ అనేశాడు.
దీనికి బిందు మాధవి గట్టి కౌంటర్ ఇచ్చింది. `తూఫాన్ వచ్చే ముందు క్లైమేట్ కూడా చాలా కూల్ గా వుంటుంది రా... తర్వాతే చాలా వైలెంట్ గా వుంటుంది` అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. ఇద్దరి మధ్య సాగే ఫన్నీ వార్ గా ఈ షోని డిజైన్ చేశారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ లో వుండే థ్రిల్ మొత్తం ఇందులో వుండబోతోందని హోస్ట్ గా వ్యవహరిస్తున్న రవి చెప్పడం కొసమెరుపు. సరదా సరదా ఆటలతో ఫన్నీ సంచ్ లతో సాగే ఈ షో జూలై 24 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది.