English | Telugu
రష్మీ పెళ్లి కుదిరింది.. సుధీర్ పరిస్థితి?
Updated : Jul 20, 2022
'ఎక్స్‌ట్రా జబర్దస్త్', 'ఢీ' షోలతో పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మీ గౌతమ్. సుధీర్-రష్మీ జంటకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కొన్నేళ్లుగా బుల్లితెరపై వీరు చేస్తూ వస్తోన్న హంగామాకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆ ఇద్దరూ నిజ జీవితంలో జంటగా మారాలని ఎదురుచూస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. తెరపై వీరి రొమాంటిక్ ట్రాక్ కారణంగానే వారికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. లేటెస్ట్‌గా ఆ ఫ్యాన్స్ అందరికీ షాకిచ్చింది రష్మీ. తొమ్మిదేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏమారుస్తూ వచ్చిన ఆమె.. ఇప్పుడు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
ఒకవైపు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌తో ఆకట్టుకుంటూ వస్తోన్న రష్మీ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్‌లతో కుర్రకారుని హీటెక్కిస్తోంది. విజువల్ ట్రీట్‌తో వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొమ్మిదేళ్లకు పైగా జబర్దస్త్ వేదికగా సుధీర్‌తో రొమాంటిక్ ట్రాక్ నడుపుతూ వచ్చిన ఆమె.. ఇప్పుడు సుధీర్ ఆ షో నుంచి తప్పుకోవడంతో సింగిల్ అయిపోయింది.
ఆ ఇద్దరికీ రోజా బుల్లితెరపై పెళ్లి చేసి, ముచ్చట తీర్చుకున్న తర్వాత.. చాలా షోలలో సుధీర్-రష్మీ పరస్పరం తమ ప్రేమను చాటుకుంటూ తమపై వచ్చిన వదంతులకు మరింత ఆజ్యం పోస్తూ వచ్చారు. ఇటీవల 'జబర్దస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'ల నుంచి తప్పుకున్న సుధీర్.. స్టార్ మా చానల్‌లో వరుస షోలు చేసుకుంటూ పోతున్నాడు. మరోవైపు రష్మీ మాత్రం జబర్దస్త్‌ను అంటిపెట్టుకొని ఉండిపోయింది.
9 సంవత్సరాలుగా పెళ్లిపై స్పందించని రష్మీ, ఇప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో పెళ్లి గురించి చెప్పి షాకిచ్చింది. ఆ షోలో 'అక్కా! బావెక్కడ?' అనే స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అందులో "తొమ్మిదేళ్లుగా అడుగుతున్నారు కదా.. ఆ ప్రశ్నకు ఈ రోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. పెళ్లి కుదిరింది" అంటూ చెప్పి రష్మీ సిగ్గుల మొగ్గయింది రష్మీ. జూలై 24న ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.