English | Telugu
శ్రీముఖికి హ్యాండ్ ఇచ్చిన చరణ్!
Updated : Jul 20, 2022
సరిగమప ఫ్యాన్స్ స్పెషల్ రౌండ్ - 3 ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ షోకి కార్తికేయ మూవీ హీరో నిఖిల్ వచ్చి సందడి చేశాడు. "ఇంతకు మీ ఆవిడ ఎలా ఉన్నారు?" అని నిఖిల్‌ని అడిగింది శ్రీముఖి. "నాకు తెలిసి ఈ షో చూస్తూ ఉంటుంది.. ఎందుకంటే తనకు ఈ షో అంటే చాలా ఇష్టం" అని చెప్పాడు చరణ్. "నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇంత మంది అమేజింగ్ మ్యుజీషియన్స్ , సింగర్స్, ఆర్టిస్ట్స్ మధ్యలో మీరేమిటి ?" అని నిఖిల్ అడిగేసరికి ఒక్కసారిగా శ్రీముఖి షాక్ అయ్యింది.
ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి ఫాన్స్ కూడా ఉండడంతో వాళ్ళను స్టేజి మీదకు తీసుకొచ్చి వాళ్ళకు ఎందుకు ఇష్టం అనే విషయాలు ఈ స్టేజి మీద పంచుకున్నారు. అలానే కంటెస్టెంట్ అర్జున్ విజయ్ అద్భుతమైన పాట పాడి అందరిని మెస్మరైజ్ చేశాడు. ఇక తన సాంగ్‌కి చాలామంది లేడీ ఫ్యాన్స్ కూడా స్టేజి మీదకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందులో ఒక అమ్మాయి అర్జున్ పేరుని చేతి మీద పచ్చబొట్టులా పొడిపించుకుని వచ్చి అర్జున్‌కి చూపించింది.
తర్వాత డేనియల్ పాడిన పాటకు అతన్ని అభిమానించే ఒక వ్యక్తి వచ్చి అతనితోకలిసి ఒక పాట పాడి, ఆ తర్వాత బాలసుబ్రమణ్యంతో కలిసి దిగిన ఫోటో లామినేషన్ ఇచ్చి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. చివరిగా సాయి శ్రీచరణ్ వచ్చి "ఏ చిలిపి కళ్ళలోన కలవో" అనే పాట పాడాడు. బ్యాగ్రౌండ్‌లో శ్రీముఖిని చూపిస్తూ వచ్చారు. ఆ పాట విని మైమరిచిపోయింది శ్రీముఖి. పాట పూర్తయ్యాక స్టేజి మీదకు వచ్చి, "నేను చెప్పిన పాటను ఇంత అద్భుతంగా, డిస్టర్బ్ అవ్వకుండా ప్రెజంట్ చేస్తావని అస్సలు అనుకోలేదు." అని ముద్దు ముద్దుగా చెప్పింది. "నువ్ చేసే యాక్టింగ్ నాకు బాగా నచ్చుద్ది.. అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు ఉన్నావ్" అంది.
ఇంతలో చరణ్ అంటే ఇష్టపడే ఒకమ్మాయి స్టేజి మీదకు వచ్చి శ్రీముఖికి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. చేతిలో ఒక పెళ్లి కార్డు పెట్టి,"మీరు వచ్చి దగ్గరుండి మాకు పెళ్లి చేయాలి అక్కా" అంటూ శ్రీముఖికి చెప్పింది శ్రీ అనే ఆ అభిమాని. ఆ పెళ్లి కార్డు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది శ్రీముఖి.