English | Telugu

Bigg Boss 9 voting 10th week :  ఓటింగ్ లో పవన్ కళ్యాణ్  టాప్.. లీస్ట్ లో దివ్య, నిఖిల్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా నామినేషన్లో ఉన్నారు. ఇక ఈ వారం కళ్యాణ్ పడాల ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. లీస్ట్ లో నిఖిల్ ఉన్నాడు. ఎవరు ఏ స్థానాలలో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

సోమవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తనూజ స్పెషల్ కేటగిరీ కాబట్టి ట్రోఫీ కూడా ఫిక్స్ కాబట్టి ఆమె నామినేషన్స్‌లో ఉన్నా లేనట్టే. ఇక సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ చౌదరిలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మిగిలిన వాళ్లలో భరణి, డీమాన్ పవన్‌, సంజనలకు ఓటింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. పైగా వీళ్లకంటే వీక్ కంటెస్టెంట్స్ ఈవారం ఓటింగ్‌లో ఉండటంతో వీళ్లకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎటొచ్చీ.. గౌరవ్, నిఖిల్, దివ్య నిఖిత ఈ ముగ్గురూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్ కూడా ఈ ముగ్గురిలోనే ఉండబోతుంది. ప్రెజెంట్ ఓటింగ్ ప్రకారం చూస్తే లీస్ట్ ఓటింగ్‌లో ఉన్నది మాత్రం డీమాన్ పవన్, నిఖిల్.. అయితే వీళ్ళిద్దరి కంటే గౌరవ్ కాస్త గట్టిగానే ఓట్లు పడుతున్నాయి.

ఓటింగ్ లో అత్యధికంగా కళ్యాణ్ కి 22 శాతం ఓట్లు పడ్డాయి. అంటే కళ్యాణ్ పై ఏ రేంజ్‌లో ఓటింగ్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. రేస్‌లో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. కళ్యాణ్ కి 22 శాతం ఓట్లు పడ్డాయి అంటే అతనికి పీఆర్ టీమ్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందో తెలుస్తోంది. ఇక ముద్ద మందారం తనూజ ఆడియన్స్ అందరి చెవుల్లో మందార పూలు పెడతూ సెకెండ్ స్థానంలో ఉంది. సుమన్ శెట్టి నాల్గవ స్థానంలో ఉండగా భరణి అయిదో స్థానంలో ఉన్నాడు. రీతు చౌదరి ఆరో స్థానంలో ఉంది. సంజనా గల్రానీ ఏడో స్థానంలో ఉండగా దివ్య నిఖిత ఎనిమిదో స్థానంలో ఉంది. డీమాన్ పవన్ తొమ్మిది, నిఖిల్ పదో స్థానంలో ఉన్నారు. డీమాన్ పవన్ ని బిబి టీమ్ సేవ్ చేస్తారు. ‌అంటే ఈ వారం దివ్య, నిఖిల్ లో ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తారన్న మాట. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటారో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.