English | Telugu

Jayam serial : పారుకి చీర సెలెక్ట్ చేసిన రుద్ర.. గంగ ఏడపు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -110 లో......అందరు భోజనం చేస్తారు. నేను పారుని డిన్నర్ కి పిలిచానని శకుంతల చెప్తుంది. పారు, రుద్రలకి పెళ్లి అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. అందరు డల్ గా ఉంటారు. పారు మన ఇంటికి కోడలుగా వస్తే కుటుంబ గౌరవం పెరుగుతుందని శకుంతల అంటుంది. ఎలా అని పెద్దసారు అడుగుతాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇచ్చి ఎలా కుటుంబ గౌరవం పెరుగుతుంది అనేగా మీ డౌట్..

నేను నేషనల్ ఛాంపియన్ ని రుద్ర ఒక్కప్పుడు ఛాంపియన్.. ఇది చాలదా ఇద్దరు ఛాంపియన్ లు ఒకే కుటుంబంలో ఉంటే మీకే కదా గౌరవం అని పెద్దసారుతో పారు అంటుంది. నువ్వు రుద్రకి కాబోయే భార్యవి కదా వెళ్లి నువ్వే రుద్రకి భోజనం వడ్డీంచని పారుతో శకుంతల అంటుంది. మరొకవైపు కోచ్ వచ్చి రుద్ర సర్ కి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఇక రాడు నన్నే చూసుకోమ్మన్నాడు అని చెప్పగానే గంగ ఏడుస్తుంది. మరొకవైపు పెళ్లికి చీరలు సెలక్షన్ చేస్తారు. రుద్ర నాకు చీర సెలక్షన్ చెయ్యాలని పారు అంటుంది. దాంతో రుద్రకి ఇష్టం లేకున్నా సెలెక్ట్ చేస్తాడు. అప్పుడే గంగ ఫోన్ చేసి ప్రాక్టీస్ చెయ్యమన్నారు మీరు రావాలి కదా అని అడుగుతుంది. వస్తాను నువ్వు ప్రాక్టీస్ చేయమని రుద్ర చెప్తాడు.

గంగతో రుద్ర మాట్లాడడం ఇషిక, వీరు వింటారు. వీళ్ళ మధ్యలో ఇంకా దూరం పెంచాలని ఇషిక అంటుంది. పారుకి సెలక్షన్ చేసిన చీర గంగ కట్టుకుంటే ఆ విషయం పారు, శకుంతల అత్తయ్యకి తెలిసేలా చెయ్యాలని ఇద్దరు ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో రుద్ర సర్ పంపారని గంగకి ఒకతను చీర తీసుకొని వచ్చి ఇస్తాడు. అది గంగ కట్టుకుంటుంది. ఆ విషయం శకుంతల వాళ్ళకి తెలుస్తుంది. గంగ దగ్గరికి రుద్ర వచ్చి చెంపచెల్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.