Read more!

English | Telugu

బిగ్‌బాస్ : నెటిజ‌న్స్ త‌లంటినా మార్పు లేదే?

పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో సీజ‌న్ 5 త్వ‌ర‌లో ముగియ‌నున్న విష‌యం తెలిసిందే. షో ఎండింగ్‌కి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ కంటెస్టెంట్‌ల నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంతే కాకుండా కొంత మంది కంటెస్టెంట్‌లు బిగ్‌బాస్ హౌస్ అని.. కోట్ల మంది చూస్తున్నార‌నే విష‌యాన్ని మ‌రిని మ‌రీ హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీనిపై నెటిజ‌న్స్ చుర‌క‌లు అంటించినా.. ఓ రేంజ్‌లో ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ త‌లంటినా న‌వ్వు పోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

మ‌రీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో వున్న ఇద్ద‌రిపై మీమ్స్ ఓరేంజ్‌లో పేలుతున్నాయి. అరేయ్ ఏంట్రా ఇదీ మీ రొమాన్స్ యుద్ధానికి కాస్త గ్యాప్ ఇవ్వండ్రా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా చెబుతోంది ఎవ‌రి గురించో ఇప్ప‌టికే అర్థ‌మై వుంటుంది య‌స్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంతు. హౌస్‌లో ఈ ఇద్ద‌రు అవ‌స‌రం వున్నా లేకున్నా.. సంద‌ర్భ‌మా  కాదా అని ఆలోచించ‌కుండా హ‌గ్గుల‌తో పిచ్చెక్కిస్తున్నారు. అంతే కాకుండా కిస్సుల‌తో కిర్రాక్ తెప్పిస్తున్నారు. నాట‌కీయ ప‌రిణ‌మాల నేప‌థ్యంలో ప్రియాంక ఇంటి కెప్టెన్ కావాల్సింది చివ‌రికి ష‌న్ను కెప్టెన్ అయ్యాడు.

దీనికి ముందు జ‌రిగిన టాస్క్‌లో సిరిని ప్రియాంక ఎలిమినేట్ చేసి ర‌విని సేవ్ చేయ‌డం జ‌రిగింది. అది న‌చ్చ‌ని సిరి ప్రియాంక‌పై త‌న యాటిట్యూడ్‌ని చూపించింది. అంతేనా ఆ త‌రువాత నియంత సింహాస‌నాన్ని ద‌క్కించుకున్న ష‌న్నుని అడ్డంపెట్టుకుని ప్రియాంక ని కెప్టెన్ కాకుండా చేసి తను భావోద్వేగానికి లోన‌య్యేలా చేసింది. ప్రియాంక‌ని ప‌క్క‌న పెట్టి ర‌విని ష‌న్ను సేవ్ చేయ‌డంతో వెంట‌నే రియాక్ట్ అయిన సిరి ష‌న్నుపై ప‌డి ముద్దుల వ‌ర్షం కురిపించింది. దీనిపై ప్ర‌స్తుతం ఓ రేంజ్‌లో ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఎన్ని సార్లు త‌లంటినా ఒరేయ్‌ ఈ డ‌ర్టీపిక్చ‌ర్ గోల ఎంట్రా.. ఇన్ని పార్లు విమ‌ర్శించినా.. నాగ్ సార్ ఇండైరెక్ట్‌గా హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపొమ్మ‌న్నా వీల్ల‌లో మార్పులేదేంట్రా అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.