Read more!

English | Telugu

`కార్తీక దీపం`: వంటలక్క దెబ్బ అదుర్స్

బుల్లితెర సీరియ‌ల్స్‌ల‌లో ఏ నోట విన్నా ఒక్క‌టే మాట `కార్తీక దీపం`. టాలీవుడ్ స్టార్స్‌.. వారిలోని కొంత మంది ఫ్యామిలీల కూడా ఈ సీరియ‌ల్ ప్ర‌భావితం చేస్తోందంటే ఏ స్థాయిలో ఈ సీరియ‌ల్ క్రేజ్‌ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక స‌రికొత్త మ‌లుపుల‌తో సాగుతున్న కార్తీక దీపం గురువారం మ‌రో ఆస‌క్తిక‌ర అంకానికి ఎర‌లేపింది. 1205 ఎపిసోడ్‌ని బుధ‌వారం పూర్తి చేసుకున్న ఈ సీరియ‌ల్ గురువారం 1206వ ఎపిసోడ్లోకి ఎంట‌రైంది. ఈ రోజు విశేషాలేంటో చూసేద్దాం.

మోనిత ఇంట బార‌సాల‌కు వంట‌ల‌క్క‌తో పాటు సౌంద‌ర్య కుటుంబం మొత్తం హాజ‌ర‌వుతుంది. ఇక్క‌డే నాట‌కీయ ప‌రిణామాలు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ వంట‌ల‌క్క‌గా దీప ప్ర‌త్య‌క్ష్యం కావ‌డం.. అది చూసి డాక్ట‌ర్ బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయి దీప నా భార్య అని, నా స‌ర్వ‌స్వం.., నా ప్ర‌పంచం.. అని డాక్ట‌ర్ బాబు అందిరి ముందు చెప్ప‌డం.. దానికి మోనిత షాక్ అవ్వ‌డం తెలిసిందే. క‌ట్ చేస్తే దీప.. మోనిత‌కు అదిరిప‌డే దెబ్బ కొట్టింది. వంట‌ల‌క్క కొట్టిన దెబ్బ అదుర్స్ క‌దూ అంటున్నారు ఆమె అభిమానులు.

బార‌సాల సాక్షిగా మోనిత‌ని దీప అడ్డంగా బుక్ చేసింది. మోత‌ది స‌హ‌జ గ‌ర్భం కాద‌ని, ఆర్టిఫీషియ‌ల్ గ‌ర్భ‌మ‌ని తేల్చేస్తుంది దీప‌. ల్యాబ్ టెక్నీషియ‌న్ కు డ‌బ్బు ఆశ చూపించి షాంపిల్స్‌ని తీసుకుంద‌ని, త‌ద్వారా గ‌ర్భం దాల్చింద‌ని నిరూపిస్తుంది దీప‌. మోనిత కాద‌ని బుకాయించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ల్యాబ్ వ్య‌క్తి వీడియోని సాక్షంగా చూపించి షాకిస్తుంది. దీంతో అంతా మోనిత‌ని చీకొడ‌తారు. అయితే అప్పుడే సినిమా అయిపోయింద‌నుకోకు ఇంకా వుంది అని మోనిత.. దీప‌తో అంటుండ‌గానే సౌంద‌ర్య .. మోనిత చెంప ఛెల్లుమ‌నిపిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. మోనిత చేయ‌బోతున్న మ‌రో కుట్ర ఏంటీ అన్న‌ది తెలియాంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.