English | Telugu

పద్దెనిమిదవ అంతస్తు నుండి దూకేద్దనుకున్నా.. గౌతమ్ వరెస్ట్ మూమెంట్!

బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 ఫైనలిస్ట్ లు మాత్రమే మిగిలారు. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు. అవినాష్ తనకి పుట్టిన బిడ్డ చనిపోయాడంటూ ఎమోషనల్ అవ్వగా, ప్రేరణ వాళ్ళ నానమ్మతో తన బాండింగ్ గురించి చెప్పుకుంటూ ఏడ్చేసింది. అలాగే గౌతమ్, నిఖిల్ లు తమ వరెస్ట్ అండ్ బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు.

గౌతమ్‌ తన లైఫ్ లో జరిగింది చెప్పాడు. ఈ విషయం ఇంతకుముందే చెప్పాను.. నేను ఢిల్లీలో మెడిసిన్‌ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్‌ అయింది. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. చివరి వరకు వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది.. నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేయాలనుకున్నాను.. అప్పుడు ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయానన్నాడు. ఇక బెస్ట్ అంటే బిగ్‌బాస్ హౌస్‌లోకి నా తల్లిని తీసుకురావడం ఎప్పటికి మర్చిపోలేనంటూ గౌతమ్ చెప్పాడు.

కాసేపటికి నిఖిల్ తన కష్టాల గురించి చెప్పాడు. నేను ఆర్కిటెక్ట్‌ కోర్స్‌ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్‌ వచ్చింది. దీంతో చదువు మధ్యలోనే వదిలేశాను. కానీ తర్వాత ఛాన్సులు లేక మూడేళ్ల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. దీంతో రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. దీంతో నువ్వు ఇంటికి భారమయ్యావు.. నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అంటూ తిట్టింది. ఆ రోజులు మర్చిపోలేను. తర్వాత కన్నడ సీరియల్‌లో ఆఫర్‌ వచ్చింది. రోజుకి రూ.2500 ఇస్తామన్నారు. అయితే నెలకి రూ.75 వేలు వస్తాయనుకున్నాను. కానీ నెలకి పదిరోజులే షూటింగ్‌ జరిగేది. కానీ ఆ తర్వాత తెలుగు సీరియల్‌ అయిన గోరింటాకులో ఛాన్స్ వచ్చింది. అప్పటి నంచి ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. స్టార్ మాకి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ నిఖిల్ అన్నాడు. ఆ తర్వాత సుమ వచ్చి ఫుల్ ఫన్ చేస్తూ ఎంటర్‌టైన్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.