English | Telugu

దీపని ఎటాక్ చేసింది మేము కాదంటూ డైవర్ట్ చేసిన పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -228 లో.....దీపపై ఎటాక్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ కి డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చేస్తాడు. పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా భార్య పై ఎటాక్ చేయించింది మీరే కదా అని అడుగగా.. పారిజాతం టెన్షన్ పడుతుంది. జ్యోత్స్న ఏదో ఒకటి కవర్ చెయ్యమని చెప్తుంది. మేమ్ ఎందుకు ఎటాక్ చేస్తాం.. మాకేం అవసరం తన మాజీ భర్త అయి ఉండొచ్చు లేక అతని భార్య శోభ అయి ఉండొచ్చని కార్తీక్ మనసుని డైవర్ట్ చేస్తుంది పారిజాతం. ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తుంది.

నేనే తప్పుగా అనుకున్నానా అని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు శౌర్య నాకు కబుర్లు చెప్పమని అంటుంది. నాకు పని ఉందంటూ కార్తీక్, దీపలు వెళ్తుంటే తను అలుగుతుంది. దాంతో ఇద్దరు పనులు మానేసి శౌర్యతో కబుర్లు చెప్తారు. కార్తీక్ కళ్ళు మండుతుంటే దీప చీర కొంగుతో శౌర్య ఆవిరి పడుతుంది. నాకు అమ్మకి నువ్వున్నావ్.. నీకు నేనున్నాను అని శౌర్య అనగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న పారిజాతంలు మాట్లాడుకుంటారు. దీపని ఏదో ఒకటి చెయ్యాలని జ్యోత్స్న అనగానే అప్పుడే సుమిత్ర వచ్చి‌.. ఏం చేస్తావ్? దీప జోలికి పోతేనే తను మీ జోలికి వస్తుంది. తన మంచిదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నని మీరే చెడగొడుతున్నారని పారిజాతంపై కోప్పడుతుంది సుమిత్ర. ఎంతైనా సొంత కూతురు దీప కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందని జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న ఆఫీస్ కి వెళదామని అంటాడు. దాంతో పారిజాతంకి జ్యోత్స్న బై చెప్పి వెళ్తుంది. అక్కడే ఉన్న సుమిత్రకి చెప్పదు. మరొకవైపు కార్తీక్ ఆఫీస్ కి రెడీ అవుతాడు. అప్పుడే దీప ఫైల్ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో ఈ రోజు ఆఫీస్ కి వెళ్లాలని లేదు దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.