English | Telugu

చెట్టు కింద హారిక అందాల ఆరబోత

ఈరోజున ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి అంటే తప్పనిసరిగా సోషల్ మీడియా ఒక్కటే సోర్స్.. ప్రతీ ఒక్కరూ దీన్నే నమ్ముకుని ఎవరి ఇమేజ్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక అదే దారిలో పయనిస్తోంది. యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్లకు ఈమె మస్త్ పరిచయమే. అలాగే బిగ్ బాస్ సీజన్ 4తో ఇంకా ఎంతో మందికి పరిచయమయ్యింది. రెగ్యులర్ గా హారిక రకరకాల యాంగిల్స్ లో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్‌గా గోల్డ్ కలర్ టాప్ లో కన్ను గీటుతూ, నవ్వుతూ ఉన్న‌ ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసింది. హారిక అలా నవ్వేసరికి బుగ్గ మీద సొట్ట పడింది. "ఇది డింపుల్ అని నేను అనుకుంటున్నాను" అనే కాప్షన్ తో ఈ ఫోటో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

తెలంగాణా యాసలో హారిక చేసే వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఇంకా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా దేత్తడి నటించింది. వీటితో పాటు కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేసి తనలో టాలెంట్ మొత్తాన్ని ప్రదర్శించింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్న హారికకు అవకాశాలు రాక యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటోంది. ఇప్పుడు ఈ సొట్ట బుగ్గ అమ్మాడి పోస్ట్ చేసిన ఫోటో కి సో బ్యూటిఫుల్, వావ్ క్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.