English | Telugu

లాస్య డబ్బు కాజేసిందని తులసి గ్రహిస్తుందా ?

అదృష్టం వచ్చినట్టే వచ్చే లాస్ట్ మినిట్ లో ఎందుకు చేజారిపోతోందో తెలియట్లేదు అని ప్రేమ్ శృతి బాధపడుతూ ఉంటారు. మరో వైపు తులసి అసలు తనకు ఇలా ఎందుకు జరుగుతోంది. నేను ఎవరినీ అనుమానించలేను అనుకుంటుంది మనసులో. బ్యాంకు లోన్ కోసం మావయ్యగారికి హెల్ప్ చేయమని అడిగాను ఆయన రిటైర్ బ్యాంకు మేనేజర్ నెంబర్ ఇచ్చారు. మరి ఈ రంజిత్ ఎవరు అని అప్పుడు సీన్ రీకలెక్టు చేసుకుని బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి రంజిత్ గురుంచి అడుగుతుంది. రంజిత్ ఎవరో తెలీదు అంటాడు బ్యాంకు మేనేజర్. ఐతే ఇది ప్లాన్ ప్రకారమే నన్ను టార్గెట్ చేసి నా డబ్బు కాజేశారని క్లియర్ కట్ గా అర్ధం చేసుకుంటుంది.

తులసి. మరో పక్క అభి దగ్గరకు గాయత్రి వస్తుంది. ఏమిటి ఎప్పుడూ ప్రొఫెషన్ గురించేనా పర్సనల్ లైఫ్ గురుంచి పట్టించుకోవా అంకిత గురుంచి ఏం ఆలోచించావ్ అని అడుగుతుంది. మరో వైపు నందు తనకు ఇంటర్వ్యూ కి టైం అయ్యిందని చెప్పి వెళ్లబోతాడు. బిజినెస్ ప్లాన్ చేసావ్ గా జాబ్ వద్దు అంటుంది. అంత డబ్బు ఎవరిస్తారు అంటాడు, బిజినెస్ కలిసి రావట్లేదు చేయను అంటాడు. వెంటనే లాస్య డబ్బు తీసి ఇస్తుంది. నా ఫ్రెండ్ సంజన ఇచ్చింది అని చెప్తుంది. తులసి బ్యాంకుకు వెళ్లి రంజిత్ గురుంచి ఆరా తీస్తుంది. అతని నెంబర్ కి కాల్ చేస్తే కలవదు. మరో పక్క తులసిని మోసం చేసినందుకు లాస్య, భాగ్య ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా తులసి సమస్యను ఎలా సాల్వ్ చేసుకుందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.