English | Telugu

రిషి, వసు కలిశారంటూ మురిసిపోయిన జగతి


వసు, రిషి ఇద్దరూ పుచ్చకాయ ముక్కలు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో వైపు జగతి, మహేంద్ర ఎదురెదురుగా కూర్చుని ఆలోచిస్తుంటారు. ఇంతలో జగతి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అదేదో నాకూ చెప్తే నవ్వుతానుగా అంటాడు మహేంద్ర. రిషి, వసు దగ్గరవుతున్నారు అంటుంది జగతి. అంత ఫీల్ అవ్వకు.. రిషి ఏ విషయం అంత తొందరగా మర్చిపోడు నీ విషయంలోనే చూసావుగా చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నీ మీద అదే కోపం. ఏమన్నా తగ్గిందా అంటాడు. జగతి ఎమోషనల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

ఇక మహేంద్ర జగతికి సర్ది చెప్పబోతాడు. వసు లవ్ లెటర్ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంకో పక్క రిషి తనదగ్గరకు వసు వచ్చినట్టు ఫీల్ అవుతాడు. తర్వాత వాళ్ళ మధ్య జరిగిన విషయం తెలిసి బాధపడతాడు. ఇక తాను స్కాలర్ షాప్ టెస్ట్ లో టాప్ లో ఉందని తెలిసి కంగ్రాట్స్ చెప్తాడు రిషి. మీరు ఆరోజు నాకు ఎంతో అండగా ఉన్నారు కాబట్టే అని అనేసరికి జరిగింది తలుచుకుని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మినిస్టర్ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని జగతి మహేంద్రకు చెప్తుంది.

వసు మంచి మార్కులు సాధించినందుకు ఒక సోషల్ ఎవెర్ నెస్ ప్రోగ్రాం చేయమని కూడా చెప్పారంటుంది జగతి. ఇక రిషి, వసు తాము కొలిచే అమ్మవారి దగ్గరకు వెళ్లి ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లి వాళ్ళ పేర్లు రాసి కాపాడు తల్లి అంటూ ప్రార్థిస్తారు. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం స్టార్ మాలో సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు లో చూడొచ్చు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.