English | Telugu
Illu illalu pillalu : భాగ్యం భాగోతం బట్టబయలు చేసిన ప్రేమ, నర్మద!
Updated : Aug 19, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -240 లో.. రామరాజు ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేస్తారు. ఇక శ్రీవల్లితో భాగ్యం ఇంట్లో ఎలా గొడవ చెయ్యాలని ప్లాన్ చెప్తుంది. పూజ నేనే చేస్తానని చెప్పు.. నీ తోడికోడళ్ళు వద్దని అంటారు. అప్పుడు నేను ఇంట్లో గొడవ అయ్యేలా చేస్తానని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత అందరు పూజ దగ్గరికి వస్తారు. నేనే పూజకి కూర్చుంటానని శ్రీవల్లి అంటుంది. దాంతో నర్మద, ప్రేమ ఇద్దరు శ్రీవల్లికి దగ్గరికి వెళ్తారు. తోడికోడళ్ళు ఎక్కడ గొడవ పెట్టుకుంటారోనని వేదవతి టెన్షన్ పడుతుంది.
పూజనే కదా అక్కా నువ్వే చెయ్.. ఇంటికి పెద్ద కోడలు కదా.. మేమ్ ఏం అనుకోమని ప్రేమ, నర్మద అనగానే శ్రీవల్లి, భాగ్యం షాక్ అవుతారు. అదేంటి అంత ఈజీగా ఒప్పుకున్నారు.. వద్దంటే గొడవ చేద్దామనుకున్నానని భాగ్యం అనుకుంటుంది. ఆ తర్వాత పూజ దగ్గరికి మీ నగలు అన్ని తీసుకొని రండీ అని పూజారి చెప్పగానే శ్రీవల్లి కి టెన్షన్ మొదలవుతుంది. ఇందుకా మీరు నేను పూజ చెయ్యాలని అన్నది అనీ శ్రీవల్లి అనుకుంటుంది. వెళ్ళు అక్క వెళ్లి నగలు తీసుకొనిరా అని ప్రేమ, నర్మద అనగానే శ్రీవల్లి తన గదిలోకి వెళ్తుంది. వెనకాలే భాగ్యం వెళ్తుంది. ఇప్పుడు ఈ నగలు తీసుకొని వెళ్తే గిల్టీ నగలు అని బయటపడుతుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంటే భాగ్యం ఒక ప్లాన్ చెప్తుంది. ఒక క్లాత్ లో గిల్టీ నగలు అన్నీ మూట కట్టి కలశంలో దూరుస్తారు.. అవి బయటకు తియ్యరాకుండా ఒక రాడ్ తో కొడతారు.
ప్రేమ, నర్మద తమ నగలు తీసుకొని వచ్చి పూజ దగ్గర పెడతారు. శ్రీవల్లి కలశం తీసుకొని రావడంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. దొంగలు వస్తున్నారు కదా.. ఇందులో నగలు పెట్టానని శ్రీవల్లి చెప్తుంది. సరే అందులో నుండి తియ్యి అక్క అని నర్మద అంటుంది. శ్రీవల్లి అందులో నగలు తియ్యబోతుంటే చెయ్యి దూరదు. నర్మద, ప్రేమ ట్రై చేస్తారు. వాళ్లకు కుడా అలాగే జరుగుతుంది. తరువాయి భాగంలో భాగ్యం ఇంటికి ప్రేమ, నర్మద వెళ్తారు. వాళ్ళ బండారం బయటపడుతుంది. వెంటనే ఈ విషయం మావయ్య గారికి చెప్తామని ప్రేమ, నర్మద కలిసి రామరాజు దగ్గరికి వస్తారు. ఇద్దరు కలిసి ఏదో చెప్తారు. రామరాజు కోపంగా వాళ్ళతో కలిసి బయల్దేర్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.