English | Telugu

Jayam serial : అర్థనారీశ్వరిలా గంగ.. కాపాడిన రుద్ర.!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -31 లో.... గంగ కోసం రుద్ర వెతుకుతుంటాడు. మరొకవైపు రౌడీలు కూడా గంగ కోసం వెతుకుతారు. రౌడీల నుండి గంగ తప్పించుకొని గుడిలోకి వెళ్తుంది. అక్కడ స్పృహతప్పి పడిపోతే అక్కడున్న వాళ్ళు తనకి హెల్ప్ చేస్తారు. గంగ అక్కడున్న పంతులికి జరిగిందంతా చెప్తుంది. నువ్వు ఇప్పుడే వెళ్ళకని పంతులు చెప్తాడు. మరొకవైపు రుద్రని చంపడానికి వీరు రౌడీని మాట్లాడతాడు.

రుద్ర ఒక దగ్గర కార్ ఆపి పక్కకి వెళ్తాడు. మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి ఎక్కబోతుంటే వెనకాల నుండి రౌడీ వచ్చి ఆక్సిడెంట్ చేస్తాడు. రుద్ర దూరంగా పడతాడు. ఆ రౌడీ వీరుకి ఫోన్ చేసి పనిపూర్తి అయిందని చెప్తాడు. మరొకవైపు రౌడీలు గుడికి వెళ్లి ఒక అమ్మాయి ఇటువైపు ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. లేదని పంతులు చెప్తాడు. రౌడీలు అక్కడక్కడే తిరుగుతుంటారు. గంగ ఇంకా కొంతమంది కలిసి అర్థనారీశ్వరిలాగా రెడీ అయి డాన్స్ చేస్తుంటారు. ఎక్కడ ఆ రౌడీలు గుర్తుపడతారోనని గంగతో పాటు పంతులు టెన్షన్ పడతాడు. రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రుద్ర దగ్గరికి ఒక స్వామి వచ్చి.. తనకి నీళ్లు ఇచ్చి కట్టుకడతాడు. రుద్ర స్పృహలోకి వస్తాడు. నువ్వు ఎవరి గురించి అయితే వెళ్తున్నావో తనే నీ జీవితగమనం అవుతుందని స్వామి చెప్తాడు. గంగ కోసం రుద్ర బయల్దేరతాడు.

మరొకవైపు కృతజ్ఞతలు పంతులు గారు.. నన్ను ఆ రౌడీల నుండి కాపాడారని గంగ అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతుంటే.. మళ్ళీ రౌడీలు వస్తారు‌. గంగ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్న మను వస్తాడు. ఏం యాక్టింగ్ చేశారు. అక్కడున్న వాళ్లందరికి కత్తిపెట్టి బెదిరిస్తాడు. ఇప్పుడు ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటా వెళ్లి రెడీ చేసి తీసుకొని రండి అనీ అక్కడున్న వాళ్ళతో చెప్తాడు. గంగని తీసుకొని లోపలికి వెళ్తారు. తరువాయి భాగంలో మను గంగ మెడలో తాళి కట్టబోతుంటే రుద్ర ఏంట్రీ ఇచ్చి మనుని కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.