English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తతో భార్యని గెంటించేలా చేసిన సవతి తల్లి.. ఇదేం ట్విస్ట్ రా మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -221 లో.....రౌడీని తీసుకొని వచ్చి రామలక్ష్మి, మాణిక్యంలు నిజం చెప్పిస్తారు. ఇదంతా చేసింది ఈ సందీప్ అని రౌడీ చెప్పి మళ్ళీ ఇలా చెప్పకుంటే.. ఈ రామలక్ష్మి మాణిక్యంలు చంపేస్తానని బెదిరించారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నన్ను ఎప్పుడు ఈ సందీప్ చూడలేదని రౌడీ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రౌడీ చెప్పి వెళ్లిపోతుంటే.. వద్దని మాణిక్యం అంటాడు. వెళ్లనివ్వని సీతాకాంత్ అంటాడు.

చూసావా సీతా.. నీ భార్య ఎలా చేసిందో.. అన్నాతమ్ముడిని విడదియ్యానుకుంటుంది. ఎప్పుడు నిన్ను గానీ తనని గాని పరాయిలాగా చూసానా అని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు బావ గారు.. ఇందాక తప్పు చేసాడని మీ భార్య అనగానే.. తమ్ముడని చూడకుండా కొట్టారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇప్పుడు ఎం చేస్తారని శ్రీవల్లి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు.. ఎప్పుడు ఆయన క్షేమం కోసం మాత్రమే చేశానని రామలక్ష్మి అంటుంది. చక్కగా ఉన్న కుటుంబంలోకి వచ్చి అన్న తమ్ముళ్లని విడదీసి ఆస్తులు కొట్టేయాలనుకుందని శ్రీలత అంటుంది. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఎందుకు ఉండడమంటూ శ్రీవల్లి సందీప్ లు బ్యాగ్ తో బయలుదేరతారు. ఉండండి అని శ్రీలత అంటుంది. వదిన నాపై ఉన్నా కోపంతో ఆస్తులు కోసం అన్నయ్యనే చంపాలనుకుంటున్నానని చెప్తుంది అందుకే దూరంగా ఉండి.. నాకు నేనే శిక్ష వేసుకుంటా అని సందీప్ వెళ్లిపోతుంటే.. ఆగండీ మీరెందుకు వెళ్లడం తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు.

నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకి తెలుసని సీతాకాంత్ అంటాడు. దాంతో రామలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్లి బట్టలు సర్దుకొని బ్యాగ్ తో బయటకు వస్తుంటే.. సీతాకాంత్ బాధపడతాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.