English | Telugu

బేబక్క పిల్లికి దుబాయ్ లో పెళ్లి


బిగ్ బాస్ బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ లో ఏమో కానీ బయట మాత్రం సోషల్ మీడియాని ఆమె వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోరేమో అనిపిస్తుంది. చిన్న లైన్ దొరికినా చాలు ఒక వీడియో చేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఫుల్ కామెడీగా ఉంది. బేబక్క దగ్గర ఎప్పుడూ ఒక పిల్లి పిల్ల ఉంటుంది. దాని పేరు సింబా. దానికి పెళ్లి చేయాలని అక్క డిసైడ్ అయ్యింది.

సో దాన్ని ఎయిర్ పోర్ట్ కి తీసుకొచ్చింది. విషయం ఏమిటి అంటే అది ఆడపిల్ల అంట. దానికి కోసం దుబాయ్ ఫ్లయిట్ లో కాబోయే పెళ్ళికొడుకు వస్తున్నాడని తన సింబాని తీసుకొచ్చిందట. ఒకవేళ ఆ పిల్లి సింబాకి నచ్చితే పెళ్లి చేసేసి దుబాయ్ ఫ్లయిట్ లో పంపించేస్తుందట. సింబాతో పాటు తాను కూడా దుబాయ్ వెళ్ళిపోయి అరబ్ షేక్ గారి పెళ్లిలో ప్రోగ్రామ్స్ అవీ చేసుకుని అక్కడే సెటిల్ ఐపోతానని చెప్పుకొచ్చింది. ఇక యూట్యూబర్‌గా పాపులర్ అయిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఐతే బిగ్ బాస్ హౌస్ లో జస్ట్ వన్ వీక్ ఉన్న బేబక్క ఈ వారానికి సుమారుగా రూ. 1.50 లక్షలు సంపాదించింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.