English | Telugu
Eto Vellipoyindhi Manasu : భర్తకి ప్రాణగండం.. చెల్లెలి కోసం వాడిని సీతాకాంత్ బయటకు తీసుకొస్తాడా!
Updated : Jan 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -314 లో.....రామలక్ష్మి స్వామి దగ్గరికి వెళ్తుంది. నీ భర్తకి మరణగండం ఉందని చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి అని రామలక్ష్మి అనగానే.. త్వరలోనే చెప్తాను కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని స్వామి చెప్తాడు. సీతాకాంత్ దగ్గరికి సిరి వస్తుంది. అన్నయ్య ఈ టైమ్ లో నా భర్త నా దగ్గర ఉండాలి అనుకుంటా కదా దయచేసి నా భర్తని విడిపించమని సిరి రిక్వెస్ట్ చేస్తుంది.
అప్పుడే రామలక్ష్మి వచ్చి.. వద్దు వాళ్ళు ఇప్పటికే చాలా తప్పులు చేశారు. నా భర్తని చంపాలనుకున్నారని రామలక్ష్మి కఠినంగా మాట్లాడుతుంది. కనీసం నాకు డెలివరి అయ్యేవరకు అయినా ధనని నాతో ఉండేలా చూడమని సిరి అనగానే.. కుదరదని రామలక్ష్మి అంటుంది. మళ్ళీ వాళ్ళని నమ్మి బయటకు తీసుకొని వస్తే మళ్ళీ హాని చెయ్యరని నమ్మకం లేదు.. మాకు హాని కలిగించాలని చూసిన వాళ్ళ పేర్లు కూడా మాకు వినపడడానికి వీల్లేదని రామలక్ష్మి చెప్పగానే.. సిరి వెళ్ళిపోతుంది. మరోవైపు రాజీవ్ తో శ్రీలత మాట్లాడుతుంది. ఆ భద్రం గాడు సందీప్, ధనలని కూడా కేసులో ఇరికించాడని చెప్తుంది. ఎలాగైనా వాళ్ళని బయటకు తీసుకొని రా అని చెప్తుంది. అప్పుడే సిరి వస్తుంది. ఏమైంది ఆ రామలక్ష్మి కుదరదని చెప్పింది కదా అని శ్రీలత అంటుంది. దాంతో సిరి లోపలికి వెళ్తుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళు బయటకు రావాలని రాజీవ్ తో శ్రీలత చెప్తుంది. శ్రీలత లోపలికి వెళ్తుంది. శ్రీవల్లి వచ్చి నువ్వు ఎవరు.. నిన్ను ఎప్పుడు చూడలేదని రాజీవ్ ని అడుగుతుంది. నేను తనకి కావాలసిన వాడిని.. నా పేరు రాజీవ్ అని చెప్తాడు. అప్పుడే శ్రీలత నగలు తీసుకొని వచ్చి వీటితో మా వాళ్ళని బయటకు తీసుకొని రా అని చెప్తుంది.
సిరితో రామలక్ష్మి అన్న మాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని బాధపడతాడు. రామలక్ష్మి పక్కకి వస్తే దూరం వెళ్తాడు. నాపై కోపంగా ఉంది కానీ ఇదంతా మీకోసం చేసాను. తప్పు అయితే క్షమించండి అని రామలక్ష్మి సీతాకాంత్ చేతులు పట్టుకొని తన చెంపలని కొట్టుకుంటుంటే.. వద్దని ప్రేమగా దగ్గర కి తీసుకుంటాడు సీతాకాంత్. మరుసటి రోజు సీతాకాంత్ తన ఫ్రెండ్ అయిన సీఐ దగ్గరికి వెళ్లి ధన, సందీప్ లు బయటకు తీసుకొని రమ్మని అంటాడు. అది కుదరదు భద్రం తనే స్వయంగా వాళ్ళు ఏ తప్పు చెయ్యలేదని చెప్తేనే వాళ్ళు బయటకు వస్తారని సీఐ చెప్తాడు. సరేనని సీతాకాంత్ అంటాడు. ఎలాగైనా సీతా సర్ వాళ్ళని బయటకు తీసుకొని రావడానికి ట్రై చేస్తుంటాడని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.