English | Telugu

ట్విస్ట్ లతో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -258 లొ.....సీతాకాంత్ స్నానం చేసి వచ్చేవరకు రామలక్ష్మి డ్రెస్ తో రెడీగా ఉంటుంది. దాంతో నాకు వద్దంటూ చిరాకు పడతాడు. ఇదంతా మీ కోసమే చేస్తున్నానని మీకు ఎప్పుడు అర్ధం అవుతుందని రామలక్ష్మి అనుకుంటుంది. మరొకవైపు శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు కిచెన్ లో వంట చేస్తుంటారు. త్వరగా చెయ్యండి మా అయన వచ్చే టైమ్ అయిందని రామలక్ష్మి అంటుంది. నేను చెయ్యనని శ్రీలత అనగానే.. ఆస్తులు వద్దా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది రామలక్ష్మి.

అప్పుడే సీతాకాంత్ వస్తాడు. అమ్మ నువ్వేంటి ఇక్కడ వంట చేస్తున్నావ్.. మీరు అందరు ఇలా ఉన్నారేంటని సీతాకాంత్ అంటాడు. ఏం లేదు నాన్న నేనే ప్రేమగా నీకు దోస చేస్తున్నానని శ్రీలత అంటుంది. అయిన నువ్వెందుకు చేయడమని సీతాకాంత్ బాధపడుతుంటాడు. నేనేం అనట్లేదు మీ అమ్మ చేస్తానంది అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి టిఫిన్ చెయ్యండి అంటూ దోస తీసుకొని వస్తుంది. వద్దని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ ఆఫీస్ కి ఆటోలో వెళ్తానని అంటాడు. మీరు సీఈఓ మీరు అలా వెళ్లడం నాకు ఇష్టం లేదని రామలక్ష్మి అంటుంది.

మరొకవైపు నందిని తన స్టైల్ ని మారుస్తుంది. ఏంటి నందిని ఇలా చేంజ్ అయ్యావని హారిక అడుగుతుంది. అనుకున్నది సాధించాలంటే ఇలా మారక తప్పదు.. రామలక్ష్మి ఆస్తులు మొత్తం తనపై రాయించుకుందట.. అందుకే ఇప్పుడు సీతాకాంత్ తనపై కోపంగా ఉన్నాడని శ్రీలత చెప్పింది. ఇప్పుడు నా వైపుకి తిప్పుకోవాలని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ డల్ గా కన్పిస్తాడు. ఏమైందని అడగ్గా.. ఇక సీఈఓకి రాజీనామా చేసి మళ్ళీ కంపెనీని స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. అలా ఎలా చేస్తావ్ నేను కూడా ఇప్పుడు నీ పార్టనర్ నీ కదా అని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.