English | Telugu

Brahmamudi : రాజ్ దొంగతనం చేశాడని చెప్పిన సీతారామయ్య.. షాక్ లో కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -572 లో.....రాజ్ ఆఫీస్ కి హుందాగా రెడీ అయి హాల్లోకి వస్తాడు. తర్వాత కంగ్రాట్స్ మీరే చెప్తారు. ఎందుకంటే పందెంలో గెలిచేది నేనే అని రాజ్ అంటాడు. పనిమనిషి శాంతని పిలిచి ఇంట్లో అన్ని వంటకాలు చెయ్యాలి. పార్టీ ఉందంటూ బిల్డప్ ఇస్తుంటాడు రాజ్. దాంతో ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు తన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతారు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లి మీ మేడమ్ రాలేదా అంటూ శృతిని అడుగుతాడు.. టైమ్ కి రావాలి కదా అంటూ అడుగుతాడు.

ఆ తర్వాత కావ్యని తీసుకొని వచ్చే డ్రైవర్ కావాలనే మెల్లిగా డ్రైవ్ చేస్తుంటాడు. త్వరగా వెళ్ళమని కావ్య అంటుంది. అప్పుడే ఒకతను డాష్ ఇస్తాడు. దాంతో అతనితో గొడవ పడుతూ.. ఇంకాస్త టైమ్ వేస్ట్ చేస్తాడు. అతనికి కొంత డబ్బు ఇచ్చి కావ్య అతన్ని పంపిస్తుంది. ఇక లేట్ చెయ్యడం నా వాళ్ళ కాదు కావ్య మేడమ్ ని తీసుకొని వస్తున్నా అని డ్రైవర్ రాజ్ కి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత జగదీష్ చంద్ర వస్తాడు. అతనికి రాజ్ తన డిజైన్స్ చూపిస్తాడు. అది చూసి అవి మేడమ్ వేసిన డిజైన్స్ అనుకుంటుంది శృతి. అప్పుడే కావ్య వచ్చి ఆ డిజైన్స్ చూసి ఆశ్చర్యపోతుంది. రాజ్ డిజైన్స్ బాగున్నాయంటూ జగదీష్ చంద్ర మెచ్చుకుంటాడు. నువ్వు చూపించు కావ్య అని అతను అనగా.. నా డిజైన్ కూడా కొంచెం అలాగే ఉంటుందని కావ్య అంటుంది. ఇక రాజ్ పోటీలో గెలిచానని సంబరపడుతాడు. మీ డిజైన్స్ మేడమ్ అవి అని శృతి అనగానే.. అది నా ప్రాబ్లమ్ నేను చూసుకుంటా, నువ్వు సైలెంట్ గా ఉండమని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వెళ్లి నేనే గెలిచానని చెప్పుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్ అందరితో నేను గెలిచానని చెప్తాడు. వీడు చేసిన మోసం తెలిస్తే ఎవరు క్షమించరు.. వీడు జగదీశ్ చంద్రకి చూపించిన డిజైన్స్ అన్ని కూడా కావ్య దగ్గర నుండి దొంగతనం చేసాడని సీతారామయ్య అనగానే.. అందరు షాక్ అవుతారు. మరి రోజు రోజు కి ఇలా తయారు అయ్యావేంటిరా వెళ్లి కావ్యని తీసుకొని రా అని సీతరామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.