English | Telugu

Karthika Deepam2 : కళ్ళు తిరిగి పడిపోయిన శౌర్య.. కార్తీక్ నిజం చెప్పనున్నాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -207 లో.. దీపని రెస్టారెంట్ కి తీసుకొని వస్తాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న ఒకవైపు.. శివన్నారాయణ‌ మరోవైపు వస్తారు. నా పేరు గానీ, ఇంట్లో వాళ్ళ పేరు గానీ ఎక్కడ వాడకని శివన్నారాయణ కార్తీక్ కి చెప్పి జ్యోత్స్నని తీసుకొని వెళ్తాడు. చూసావా తాతయ్య ఆ దీపకి ఎంత పొగరో అని జ్యోత్స్న అంటుంది. ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని శివన్నారాయణ అనగానే.. తాతయ్య ఏం చెయ్యబోతున్నారని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

ఆ తర్వాత దీపని తీసుకొని ఇంటికి వస్తాడు కార్తీక్. వాళ్లు డల్ గా రావడంతో ఏదో జరిగిందని అనసూయ, కాంచనలు అనుకుంటారు. శౌర్యకి చాక్లెట్ ఇచ్చి ఏం జరిగిందని ఇద్దరు అడుగుతారు. జ్యో ఇంకా తాతయ్య వచ్చాడని శౌర్య చెప్తుంది. అప్పుడే దీప రాగానే శౌర్య లోపలికి వెళ్తుంది. నాన్న వచ్చాడా అని కాంచన అనగానే.. ఓనర్స్ కదా వస్తారని దీప అంటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి కార్తీక్ వెళ్లి.. జ్యోత్స్న ఏంటో ఈ పొగరు.. నా బావ నీ మొగుడు అయ్యాడనా అని అంటే అవుననుకో అన్నావ్ కదా.. అది మనస్ఫూర్తిగా అన్నావా అని కార్తీక్ అడుగుతాడు. అవునని దీప అనగానే.. కార్తీక్ మురిసిపోతాడు. ఆ తర్వాత కాంచన, అనసూయ లు ఏం జరిగిందని కార్తీక్ ని అడుగుతారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.