English | Telugu

ఈ సారి అయినా బిగ్ బాస్ విన్నర్ లేడీ కంటెస్టెంట్ అయ్యేనా!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టింది. అయితే ఒక్క సీజన్ లో కూడా ట్రోఫి అనేది లేడి కంటెస్టెంట్ ని వరించలేదు. మొదటి సీజన్ నుండి అన్ని ట్రోఫీలు అబ్బాయిలే గెలుచుకున్నారు. అందరు కూడా నాగార్జునతో హౌస్ లోకి వచ్చేముందు.. ఇప్పటివరకు లేడీ బిగ్ బాస్ అవ్వలేదు. నేను అవ్వాలని వచ్చానంటూ హౌస్ లోకి వచ్చిన మహిళలు చెప్తుంటారు కానీ అది ఎప్పటికి తీరని కోరికలాగే ఉంటూ వస్తుంది.

ఇప్పటివరకు జరిగిన అన్నింటిలో శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ, సింగర్ రేవంత్, పల్లవి ప్రశాంత్ ఇలా అందరు అబ్బాయిలే బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నారు. సీజన్ లో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో శ్రీముఖి వచ్చి ఆగిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్.. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. అయితే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని భావించిన కిర్రాక్ సీత అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఉమెన్ కంటెస్టెంట్స్ లలో ప్రేరణ‌‌ స్ట్రాంగ్ గా ఉంది. అబ్బాయిలతో ఈక్వల్ గా ఆడుతూ వారికి గట్టి పోటీ ఇస్తుంది. సెకెండ్ యష్మీ.. ఆటపరంగా అయితే ప్రేరణ, యష్మీ స్ట్రాంగ్ ఉండగా.. బయట ఫాలోయింగ్ పరంగా చూస్తే విష్ణుప్రియ టాప్ లో ఉంది. రోహిణి ఎంటర్‌టైన్మెంట్ పరంగా టాప్ లో ఉంది. ఇక భారీ అంచనాలతో వచ్చిన హరితేజ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతుంది. నయని గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు ఈ వారం వోటింగ్ లో లీస్ట్ వుంది.

ఇకపోతే గంగవ్వ విషయానికి వస్తే నామినేషన్ లో లేకపోవడం వల్లే ఇప్పటికి హౌస్ లో కొనసాగుతుంది. టాప్- 5 లో మాత్రం ప్రేరణ, యష్మీ ఇద్దరు ఉంటారని తెలుస్తోంది. ది వరెస్ట్ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ ఉండగా.. గౌతమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. నబీల్ గేమ్ కాస్త డల్ అయ్యిందనేది తెలుస్తోంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.