English | Telugu

మోస్ట్ ఎమోషనల్ గా ఫ్యామిలీ వీడియోస్.. అవినాష్ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్!

బిగ్ బాస్ సీజన్-8 తెలుగు ఎనిమిదో వారం ముగింపుకి వచ్చేసింది. త్వరలోనే ఫ్యామిలీ వీక్ రాబోతుంది. ఆ లోపు శాంపిల్ గా కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీ నుండి వీడియో బైట్ లని చూపించాడు బిగ్ బాస్. అయితే ఆ అవకాశం అందరికి రాలేదు.

ప్రేరణ, నిఖిల్, గౌతమ్, గంగవ్వ లకి తప్ప అందరికి తన ఫ్యామిలీ నుండి వీడియో బైట్ చూసే అవకాశం వచ్చింది. మొదటగా బిగ్ బాస్ ఫోన్ చెయ్యగానే.. నబీల్ లిఫ్ట్ చేస్తాడు. ఫ్యామిలీ వీడియో నీకు కావాలా పృథ్వీకి ఇస్తావా అని అడుగగా.. నాకే కావాలని అంటాడు నబీల్. దాంతో నబీల్ వాళ్ళ అన్న, అమ్మ మాట్లాడింది చూపిస్తారడు బిగ్ బాస్. ఇక అది చూసిన నబీల్ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత నయనికి తన సిస్టర్ మాట్లాడిన వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. టేస్ట్ తేజ కి తన పేరెంట్స్ వీడియో చూపిస్తాడు బిగ్ బాస్. మా అమ్మ బిగ్ బాస్ టీవీలో కనపడింది చాలు అంటూ తేజ ఎమోషనల్ అవుతాడు. విష్ణు ప్రియకి తనకి తెలిసిన వాళ్ళ వీడియో, పృథ్వీకి తన బ్రదర్ వీడియో, రోహిణి కి తన మదర్ వీడియో, అవినాష్ కి తన బ్రదర్ వీడియో, యష్మీకి తన పేరెంట్స్ నుండి.. హరితేజకి తన కూతురు వీడియో చూపించేసి అందరిని ఎమోషనల్ చేస్తాడు‌ బిగ్ బాస్ మామ.

ఆ తర్వాత హౌస్ లో దీపావళి సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు కంటెస్టెంట్స్. అవినాష్ కి పాల పాకెట్స్ కావాలంటే బిగ్ బాస్ తనని రెండు నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. టైమ్ ఇవ్వండి బిగ్ బాస్ అని అవినాష్ అనగా.. టైమ్ నేను చూస్తాను.. టైమింగ్ నువ్వు చూస్కో అనినాష్ అంటూ బిగ్ బాస్ మామ చెప్తాడు. దాంతో హౌస్ అంతా ఫుల్ గా అరిచేస్తారు.‌ ఇక అవినాష్ చిరంజీవి, రాజశేఖర్, సాయి కుమర్ లా చేసి కడపుబ్బా నవ్విస్తాడు. ఇక అలా నవ్వించినందుకు రెండు పాల పాకెట్లు పంపిస్తాడు బిగ్ బాస్. ఫ్యామిలీ వీడియోస్ అనంతరం అందరు కలిసి భోజనం చేస్తారు. ఏదేమైనా నిన్నటి ఎపిసోడ్ మోస్ట్ ఎమోషనల్ గా సాగింది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.