English | Telugu

దూరదర్శన్ నటీమణులతో ఒక సీరియల్ వస్తే బాగుండు

ఒకప్పుడు దూరదర్శన్ రాజ్యమేలే రోజుల్లో వచ్చే కొన్ని సీరియల్స్ ఐనా కానీ వాటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ఆడియన్స్. అలాంటి దూరదర్శన్ ఛానల్ వచ్చిన రుతురాగాలు సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే డామిట్..కథ అడ్డం తిరిగింది. అలాగే భమిడిపాటి రామగోపాళం కథలు, వేయి పడగలు, ఆనందో బ్రహ్మ ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు. ఇక ఋతురాగాలు సీరియల్ లో నటించిన శృతి, ప్రీతి నిగమ్ అలాగే డామిట్ కథ అడ్డం తిరిగింది సీరియల్ లో నటించిన జ్యోతి రెడ్డి వీరంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు గ్రీన్ నటీమణులుగా చెలామణి అవుతూనే ఉన్నారు.

ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ మూవీస్ లో నటిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్లంతా కలిసి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆనాటి ఆ స్నేహమానంద గీతం" అనే పాటకు వాళ్ళు స్టెప్స్ వేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. "మీరు మళ్ళీ మంచి సీరియల్స్ తో కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చేసిన నెగటివ్ రోల్స్ కాకుండా మంచి కామెడీ రోల్ చేయాలని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి మంచి మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నా" అంటూ పోస్ట్ పెట్టారు. "ఇక వీళ్లంతా కూడా మంచి అవకాశం వస్తే అందరం కలిసి నటించాలని ఉంది" అని రిప్లై ఇచ్చారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.