English | Telugu

బిగ్ బాస్-9 గ్రాండ్ లాంచ్.. ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

బిగ్ బాస్ సీజన్-9 నిన్న(ఆదివారం) రాత్రి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ తో హౌస్ ఫుల్ అయింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు(కామనర్స్) తో హౌస్ ఎంటర్‌టైన్‌మెంట్ కి అడ్డాగా మారింది. (Bigg Boss 9 Telugu)

హోస్ట్ నాగార్జున బ్లాక్ డ్రెస్ లో రెడీ అయి వచ్చేశాడు. ఇక మొదటగా హౌస్ ని పరిచయం చేశాడు. ఆ తర్వాత సెకెండ్ హౌస్ ని రివీల్ చేశాడు. జీ తెలుగులో వచ్చిన 'ముద్ద మందారం' సీరియల్ ఫేమ్ తనూజ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'లక్స్ పాప' సాంగ్ ఫేమ్ ఫ్లోరా సైని, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయల్, 'రాను బొంబాయ్ కి రాను' సాంగ్ ఫేమ్ రాము రాథోడ్, 'బుజ్జిగాడు' ఫేమ్ సంజనా గల్రానీ, సీరియల్ నటి రీతు చౌదరి, డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీరియల్ యాక్టర్ భవానీ శంకర్, కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చారు.

ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో మొదటగా కళ్యాణ్ పడాల(సోల్జర్), ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ అలియాస్ హరిత హరీష్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇక అందరికి టాటా బైబై చెప్పి నాగార్జున వెళ్లే టైమ్ లో యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. తను మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించింది. అతనే మర్యాద మనీష్.. లాస్ట్ కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హౌస్ కి తాళాలు వేసి నాగార్జున అందరికి బై చెప్పేసి వెళ్ళిపోయాడు. హౌస్ లో ప్రస్తుతం పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.