English | Telugu

ఊహకందని మలుపులతో బిగ్ బాస్-9 ప్రోమో.. డబుల్ హౌస్.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా గత సీజన్లకు భిన్నంగా ఈ బిగ్ బాస్ హౌస్ ఉంది. దీనికి సంబంధించిన ప్రోమోలో హౌస్‌లో ఎలా ఉండబోతుందనే దానిపై ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అలాగే హౌస్‌లోకి వెళ్లబోతున్న కంటెస్టెంట్స్‌ని రిలీల్ చేశారు. ముఖ్యంగా అగ్నిపరీక్షలో ఫైనలిస్ట్‌లుగా నిలిచిన టాప్ 13 మంది ఫైనలిస్ట్‌లను బిగ్ బాస్ స్టేజ్‌పై చూపిస్తూ వాళ్లతో మాట్లాడి టాప్ 5 కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు నాగార్జున. (Bigg Boss 9 Telugu)

ఇది చదరంగం కాదు.. రణరంగమే అంటూ బిగ్ బాస్ సీజన్-9కి హైప్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోతో వచ్చేశారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి జియో హాట్ స్టార్, స్టార్ మా ఛానల్‌లో బిగ్ బాస్ సీజన్-9 ఆట మొదలు కానుంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్-9.

ఆశ ఒక పక్క.. ఆశయం మరోపక్క ఈ రణరంగం చూడ్డానికి మీరు సిద్దమా అంటూ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి.. నేను దేనికైనా సిద్దమే అనేశాడు. గోడల్ని బద్దలు కొట్టి బిగ్ బాస్ సెట్‌లో ఉన్న రెండు హౌస్‌లను చూపించాడు నాగార్జున. ఇప్పుడెలా ఉంది నాగార్జున అని బిగ్ బాస్ అడుగగా.. మీ తీరూ మారింది.. ఇల్లూ మారింది అని నాగార్జున అన్నాడు‌. అయితే ఈ ప్రోమోలో ఒక మెలిక పెట్టాడు బిగ్ బాస్. ఓ కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న వస్తువుని ఇంట్లోకి తీసుకుని వెళ్తానంటే.. నో చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ అది లేకపోతే నేను హౌస్‌లోకి వెళ్లనని అనడంతో అతన్ని బిగ్ బాస్ వెనక్కి పంపించేశాడు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు.. హౌస్ లోకి వెళ్ళిందెవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.