English | Telugu

Jayam serial : గంగపై ఎటాక్ ప్లాన్ చేసిన వీరు.. సేవ్ చేసిన రుద్ర! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -49 లో... వినాయకుడి విగ్రహం నిమజ్జనానికి గంగ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వినాయకుడికి శకుంతల పూజ చేస్తుంది. గంగ వస్తుంటే భాను వచ్చాడనుకొని శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఇక ఇంట్లో అందరు చాలా సంతోషంగా ఉంటారు. అందరు వినాయకుడి ముందు తీన్ మార్ డాన్స్ చేస్తుంటారు. శకుంతల హ్యాపీగా ఉండడం చూసి రుద్ర సంతోషపడతాడు. ఇందుమతి డాన్స్ చేస్తుంది. వీరు ప్లాన్ లో భాగంగా తన మనిషితో రుద్రకి పాపతో రౌడీలున్న వీడియోని పంపిస్తాడు. అది చూసి రుద్ర అక్కడ నుండి బయల్దేరతాడు. రుద్ర వెళ్ళడం చూసి సైదులుకి‌ వీరు ఫోన్ చేసి గంగ దగ్గరికి రమ్మని చెప్తాడు.

ఆ తర్వాత అందరు డ్యాన్స్ చేసి అలసిపోయి పక్కకి వస్తారు. గంగ ఇంకా కొంతమంది డ్యాన్స్ చేస్తారు. అప్పుడే సైదులు కత్తి పట్టుకొని వచ్చి.. గంగ తల దగ్గర పెట్టగా.. వెనకాల నుండి రుద్ర వచ్చి ఆపుతాడు. సైదులు తప్పించుకుంటాడు. ఈ రుద్ర మళ్ళీ ఎందుకు వచ్చాడని వీరు డిజప్పాయింట్ అవుతాడు. గంగ భయపడుతూ శకుంతల దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.