English | Telugu

శంకర్ తొలి చిత్రం 'జెంటిల్ మేన్'కి 30 ఏళ్ళు.. కమల్, రాజశేఖర్ వదులుకున్న సినిమా!

దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సామాజిక సమస్యలకు సాంకేతిక హంగులు జోడించి సినిమాలను రూపొందించడం.. ఈ దిగ్గజ దర్శకుడి శైలి. తొలి చిత్రం 'జెంటిల్ మేన్' నుంచి శంకర్ తన మార్క్ ను చూపిస్తూ వచ్చారు. విద్యావ్యవస్థలోని లొసుగులను లక్ష్యంగా చేసుకుని  తన డెబ్యూ మూవీ 'జెంటిల్ మేన్'ని తెరకెక్కించారాయన. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమా.. అనువాద రూపంలో తెలుగువారిని కూడా విశేషంగా అలరించింది. శంకర్ కి శుభారంభాన్నివ్వడమే కాకుండా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రంతో.. యాక్షన్ కింగ్ అర్జున్ తమిళనాట టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలిచారు.

చిరంజీవి 'రోషగాడు'కి 40 ఏళ్ళు.. గుప్తనిధి చుట్టూ తిరిగే సినిమా!

మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో రూపొందిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో 'రోషగాడు' ఒకటి. యాక్షన్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ఆర్. దాస్ రూపొందించిన ఈ సినిమాలో మాధవి నాయికగా నటించగా.. సిల్క్ స్మిత ఓ కీలక పాత్రలో అలరించింది. కన్నడ ప్రభాకర్, ఇందిర, త్యాగరాజు, టెలిఫోన్ సత్యనారాయణ, జయవాణి, వీరభద్రరావు, జగ్గారావు, మాస్టర్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావు కథను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు.

కృష్ణ 'నేరము శిక్ష'కి 50 ఏళ్ళు.. యాక్సిడెంట్ చుట్టూ తిరిగే సినిమా!

"మనిషికి మనసే సాక్షి.. మనిషి విధించే శిక్ష తప్పినా.. మనసు వేధించే శిక్ష తప్పదు. నేరానికి శిక్ష తప్పదు.." అనే పాయింట్ తో రూపొందిన చిత్రం 'నేరము శిక్ష'.  రష్యన్ నవల 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' ఆధారంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, భారతి జంటగా నటించారు. కాంతారావు, బాలయ్య, సత్యనారాయణ, రావుగోపాల రావు, అర్జా జనార్థన రావు, కృష్ణకుమారి, పండరీ బాయి, పుష్ప కుమారి, పి. ఆర్. వరలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, పి. జె. శర్మ, మాస్టర్ విశ్వేశ్వరరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.  ఎం. బాలయ్య కథను అందించిన 'నేరము శిక్ష'కి సముద్రాల జూనియర్, మోదుకూరి జాన్సన్ సంభాషణలు సమకూర్చారు.