English | Telugu
శోభన్ బాబు 'జీవిత బంధం'కి 55 ఏళ్ళు!
Updated : Jul 26, 2023
1968 జూలై మాసం.. నటభూషణ్ శోభన్ బాబుకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. కేవలం 24 రోజుల వ్యవధిలో ఆ నెలలో నాలుగు సినిమాలతో పలకరించారాయన. 1968 జూలై 4న 'మన సంసారం'తో ఎంటర్టైన్ చేసిన శోభన్ బాబు.. అదే నెల 19న 'లక్ష్మీ నివాసం', 'పంతాలు పట్టింపులు' చిత్రాలతో ఒకే రోజున డబుల్ ధమాకా ఇచ్చారు. ఆపై చివరగా జూలై 27న 'జీవిత బంధం'తో సందడి చేశారు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం.
ఈ జూలై 27తో 55 వసంతాలు పూర్తిచేసుకున్న 'జీవిత బంధం' విషయానికి వస్తే.. ఇందులో శోభన్ బాబుతో పాటు కాంతారావు, కృష్ణకుమారి, రాజసులోచన, రామకృష్ణ, గీతాంజలి, చలం, ఆర్ముగం, త్యాగరాజు, సూర్యకాంతం, హేమలత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. విద్వాన్ రాజశేఖర్ కథ, మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ప్రముఖ గాయకుడు, స్వరకర్త ఘంటసాల వేంకటేశ్వరరావు బాణీలు కట్టిన ఈ సినిమాలో "తెగిపోయిన గాలిపటాలు" (ఘంటసాల), "లేత హృదయాలలో" (ఘంటసాల, సుశీల) అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఎ.ఎన్.సి. ఫైనాన్స్ ర్స్ సమర్పణలో మురుగ ఫిల్మ్స్ పతాకంపై ఎన్. ఆరుముగం ఈ చిత్రాన్ని నిర్మించారు.