మధుర గాయని వాణీ జయరామ్ గురించి మీకు తెలీని నిజాలు!
అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోస్లే తర్వాత 1970 నుంచీ ఒకటిన్నర దశాబ్దం పాటు ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన ఒకేసారి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మధుర గాయని వాణీ జయరామ్. "బ్రోచే వారెవరురా" (శంకరాభరణం), "ఆ లోకయే శ్రీ బాలకృష్ణం" (శ్రుతిలయలు), "మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా" (సీతాకోక చిలుక), "కురిసేను విరిజల్లులే" (ఘర్షణ) లాంటి పాటలతో ఆమె సంగీత ప్రియులను తన గాన మాధుర్యంలో ఓలలాడేట్లు చేశారు.