శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ను కమల్ హాసన్ ఎందుకు తిరస్కరించాడు?
కమల్ హాసన్, శ్రీదేవి హిట్ పెయిర్‌గా వెండితెరను ఏలారు. వారి జోడీ ప్రేక్షకులకు కన్నుల పంట. 'వసంత కోకిల'లో ఆ ఇద్దరి నటన చూసి ఉద్వేగం చెందని వారెవరు? 'ఆకలి రాజ్యం', 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' సినిమాల్లో వారి రొమాన్స్ చూసి ముచ్చటపడని వాళ్లెవరు? ఇక తమిళంలో అయితే మరిన్ని సినిమాలు జంటగా చేసి, ప్రేక్షకుల్ని అలరించారు.