English | Telugu
'వైల్డ్ డాగ్' ఫస్ట్ డే కలెక్షన్.. పూర్!
Updated : Apr 3, 2021
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ చేసిన 'వైల్డ్ డాగ్' మూవీ ఫస్ట్ డే ఆశించిన రేంజ్‌లో వసూళ్లను సాధించడంలో విఫలమైంది. రైటర్ అహిషోర్ సాల్మన్ డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సినిమా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 1.21 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రూ. 53 లక్షలు, ఆంధ్రలో రూ. 49 లక్షలు, రాయలసీమలో రూ. 19 లక్షల షేర్ సాధించింది 'వైల్డ్ డాగ్' మూవీ.
అంటే ప్రి బిజినెస్‌తో పోలిస్తే ఫస్ట్ డే ఈ సినిమాకు కేవలం 13.6 శాతం రికవరీ అయ్యింది. 'వైల్డ్ డాగ్' ప్రి బిజినెస్ వాల్యూ దాదాపు రూ. 8.9 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఫస్ట్ డే కనీసం రూ. 2 కోట్లు ఎక్స్‌పెక్ట్ చేశాయి ఆ వర్గాలు. ఇవి పూర్ ఓపెనింగ్స్ అని ఆ వర్గాలు అంటున్నాయి. ఆంధ్ర ఏరియాలో దాదాపు రూ. 4 కోట్ల ప్రి బిజినెస్ జరగగా, రూ. 49 లక్షల షేర్ రావడం కలవరపెడుతోంది. నైజాంలో బెటర్‌గా కలెక్షన్లు వచ్చాయి. ఇక్కడ బయ్యర్లు రూ. 2.5 కోట్లను వెచ్చించగా, రూ. 53 లక్షల షేర్ వచ్చింది.
మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో కలెక్షన్లలో అది రిఫ్లెక్ట్ అవుతుందని ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ రోజు, రేపు కలెక్షన్లు కచ్చితంగా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. టైటిల్ రోల్‌లో నాగ్ ప్రదర్శించిన నటన, ఆయన పవర్‌ఫుల్ డైలాగ్స్, రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వీకెండ్ కలెక్షన్లను ఇవి పెంచుతాయేమో చూడాలి.