English | Telugu
నెట్‌ఫ్లిక్స్.. ఉర్రూతలూగించే ఐదు చైనీస్ రొమాంటిక్ డ్రామాస్!
Updated : Apr 3, 2021
లవ్ ట్రయాంగిల్స్ నుంచి హై స్కూల్ ప్రేమలు, ఫేక్ రిలేషన్‌షిప్స్ దాకా చైనీస్ రొమాంటిక్ డ్రామాలు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షకుల్ని అలరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనీస్ డ్రామాలకు పాపులారిటీ ఎక్కువ. అందువల్ల ఏ షోలు అన్నింటికంటే చూడదగ్గవని ఎంచడం అంత ఈజీ కాదు. అయితే రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే ఔత్సాహిక వీక్షకుల కోసం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఐదు ఎక్సలెంట్ రొమాంటిక్ చైనీస్ డ్రామా సిరీస్‌లేవో చూద్దాం...
1. మీటీయర్ గార్డెన్ (2018)
ప్రధానాంశం: ఒక సాధారణ అమ్మాయి ఒక ప్రతిష్ఠాత్మక స్కూల్లో చదువుకోవడానికి వస్తే, అక్కడ ఎఫ్-4 అని పిలవబడే నలుగురు అందమైన, సంపన్నకుటుంబాలకు చెందిన కుర్రాళ్లను ఫేస్ చేస్తుంది.
తారాగణం: డైలాన్ వాంగ్, షెన్ యూ, కేసర్ వు, డారెన్ చెన్, కానర్ లియాంగ్
డైరెక్టర్: హెర్-లాంగ్ లిన్
ఐఎండీబీ రేటింగ్: 8.1
2. ఎ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్ (2019)
ప్రధానాంశం: మొహమాటస్తురాలైన ఓ హైస్కూల్ అమ్మాయి పాపులర్ అయిన తన సీనియర్‌ను ప్రేమించి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నది ఆసక్తికరం.
తారాగణం: వీ చాయ్, జిన్ మయ్ జాహో, కువాన్-లిన్ లాయ్, బోవెన్ వాంగ్, రుంజే వాంగ్
డైరెక్టర్: ఝియావోహుయ్ ఖీ
ఐఎండీబీ రేటింగ్: 8.0
3. ఐ హియర్ యు (2019)
ప్రధానాంశం: ఒక మృదు స్వభావి అయిన యువకుడు, ఒక ఉద్రేక స్వభావురాలైన యువతికి మధ్య ఫోర్స్‌డ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో తెలియజేసే కథలో ఫ్రెండ్‌షిప్, మ్యూజిక్, కామెడీ, రొమాన్స్ ఆకట్టుకుంటాయి.
తారాగణం: లూసీ ఝావో, రిలీ వాంగ్, గ్రాటిట్యూడ్ దాయ్, జియాంగ్ మిన్ ఝాంగ్
డైరెక్టర్: సన్నీ సు
ఐఎండీబీ రేటింగ్: 7.3
4. యాక్సిడెంటల్లీ ఇన్ లవ్ (2018)
ప్రధానాంశం: ఒక అరేంజ్డ్ మ్యారేజ్ నుంచి తప్పించుకోవడానికి తన గుర్తింపును మార్చుకున్న ఓ అమ్మాయి నెమ్మదిగా ఒక పాప్ స్టార్ ప్రేమలో పడటం, డబుల్ లైఫ్‌ను గడపడం ఈ సిరీస్ ఇతివృత్తం.
తారాగణం: జున్‌చెన్ గువో, యి నింగ్ సున్, యిఖిన్ ఝావో
ఐఎండీబీ రేటింగ్: 7.6
5. వెల్-ఇంటెండెడ్ లవ్ (2019)
ప్రధానాంశం: మిగతా నాలుగు రొమాంటిక్ డ్రామాలతో పోలిస్తే ఇది కొంచెం సెంటిమెంటల్‌గా, ఎమోషనల్‌గా నడుస్తుంది. కారణం ప్రధాన పాత్రధారి ఒక పేషెంట్ కావడం. అయితే ఇది కేవలం మెలోడ్రామా కాదు. బాగా ఎంటర్‌టైన్ చేసే కథ. లవ్ ట్రయాంగిల్స్ మేళవించిన కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ అలరిస్తుంది.
తారాగణం: క్జు కై చెంగ్, ల్యూ జియా క్జి, హువాంగ్ ఖియాన్ షువో, వాంగ్ షువాంగ్, ఇయాన్ యి
డైరెక్టర్: ఖియాంగ్ వూ
ఐఎండీబీ రేటింగ్: 7.4