English | Telugu

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డు

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని తెలిసింది. "తీన్ మార్" ఆడియో మార్చ్ 21 న విడుదల చేస్తారని మనకు తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ని మార్చ్ 21 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చాలా భారీగా, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో జరపాలని నిర్మాత గణేష్ నిర్ణయించారు. కానీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చటం వల్ల హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులు బాగా వేడిగా ఉన్నందున ఈ "తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా మారుతున్నాయనీ, వేలమంది అభిమానులు ఈ "తీన్ మార్" ఆడియోకి వస్తారని అంచనా.

యన్ టి ఆర్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది!

యన్ టి ఆర్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. అభిమానులు ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండి వస్తారు కనుక అంతమందిని నిభాయించాలంటే చాలా ప్రదేశం అవసరమవుతుంది కనుక యల్.బి.స్టేడియంలో యన్ టి ఆర్ పెళ్ళి జరిగితే అందరికీ వసతిగా ఉంటుందని, కనుక అక్కడే యన్ టి ఆర్ పెళ్ళి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ జనం అనుకుంటున్నారు. లేకుంటే షంషాబాద్ గ్రౌండ్స్ లో అయితే మరింత విశాలంగా ఉంటుందనీ, గతంలో హోం మినిస్టర్ సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పెళ్ళి కూడా షంషా బాద్ గ్రౌండ్స్ లోనే జరిగింది.

నాగార్జున రాజన్న హైదరాబాద్ లో

నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" నాగార్జునే తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ పైన నిర్మిస్తున్నారు. ఈ "రాజన్న" చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణా రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో తయారుచేసిన కథతో యువసామ్రాట్ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం నిర్మించబడుతోందని అని తెలిసింది. ఈ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రంలో నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటిస్తుంది.