English | Telugu

ద‌స‌రాకే బాలయ్య మొదటి షో!


ఇప్ప‌టి వ‌ర‌కు చాలా టాక్ షోస్ వ‌చ్చాయి. చాలా మంచి స్టార్స్ డిఫ‌రెంట్ నేమ్స్‌తో సెల‌బ్రిటీల‌ను పిలిచి వారి ప్రొఫెష‌న‌ల్, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో జ‌రిగిన విష‌యాల‌ను లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వీట‌న్నింటిలో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ టాక్ షోకి మాత్రం తిరుగులేని క్రేజ్ వ‌చ్చింది. ఇండియాలోనే టాప్ టాక్ షోగా ఐఎండీబీలో ర్యాంక్‌ను సంపాదించుకుంది. ఈ టాక్‌షో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంటే రెండింటికీ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మేక‌ర్స్ సీజ‌న్ 3కి రెడీ అయ్యారు.

సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 3 చేయ‌టానికి బాల‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయితే ఇది వ‌ర‌క‌టి కంటే మ‌రింత వేగంగా ఈ మూడో సీజ‌న్‌ను పూర్తి చేయాల‌ని కండీష‌న్ పెట్టారు. బాల‌కృష్ణ నుంచే గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన త‌ర్వాత ఆహా యాజ‌మాన్యం సైలెంట్‌గా ఉంటుందా? వారు త‌మ వ‌ర్క్‌ను స్టార్ట్ చేసేశారు. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ప్రోమో షూటింగ్ నుంచి షోను డిజైన్ చేసి తెర‌కెక్కించ‌టం వ‌ర‌కు ఎలా ఉండాలి? ఈసారి గెస్టులుగా ఎవ‌రెవ‌రిని పిల‌వాలి? అనే వాటిపై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. మీడియాలో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ద‌స‌రా పండుగ‌కే తొలి ఎపిసోడ్‌ను ప్రసారం చేయాల‌నేది అంద‌రి ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్‌ స‌హా ప‌లువురు స్టార్స్ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్స్‌లో గెస్టులుగా విచ్చేసి మెప్పించారు. ఈసారి సీజ‌న్ 3కి ఎవ‌రు వ‌స్తార‌నే అంశం అంద‌రిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సినీ ఇండ‌స్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్3లో పార్టిసిపేట్ చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.