English | Telugu
మహేష్ రికార్డుని బ్రేక్ చేసే దిశగా నాని!
Updated : Dec 10, 2023
ఒక హీరో క్రియేట్ చేసిన రికార్డుని మరో హీరో బ్రేక్ చేయడం సహజం. మహేష్ బాబు క్రియేట్ చేసిన ఒక రికార్డుని బ్రేక్ చేసే దిశగా ఇప్పుడు నాని పయనిస్తున్నాడు. మిగతా టాలీవుడ్ స్టార్స్ అందరినీ వెనక్కి నెట్టి, నాని ఈ రికార్డు సృష్టించనుండటం విశేషం.
నాని నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న' డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. గతంలో నాని నటించిన 8 సినిమాలు ఈ ఫీట్ సాధించగా.. హాయ్ నాన్న తొమ్మిదవది.
యూఎస్ లో మిలియన్ డాలర్ల సినిమాల పరంగా 11 సినిమాలతో మహేష్ బాబు టాప్ లో ఉండగా.. 9 సినిమాలతో రెండో స్థానంలో నాని ఉన్నాడు. 7 సినిమాలతో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదు సినిమాలతో ప్రభాస్, అల్లు అర్జున్, నాలుగు సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రాబోయే రెండు మూడేళ్ళలో మహేష్ రికార్డుని బ్రేక్ చేసి నాని టాప్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో 'గుంటూరు కారం'తో పలకరించున్న మహేష్.. ఆ తర్వాత కనీసం రెండు మూడేళ్లు రాజమౌళి ప్రాజెక్ట్ కి అంకితం కానున్నాడు. మరోవైపు నాని ఈ గ్యాప్ లో నాలుగైదు సినిమాలతో పలకరించే అవకాశముంది. నాని నటించిన మెజారిటీ సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా యూఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకుంటాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో మహేష్ రికార్డుని నాని బ్రేక్ చేస్తాడు అనడంలో సందేహం లేదు.