English | Telugu

శ్రీలీలని గురూజీనే కాపాడాలి!

సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.

2021లో విడుదలైన 'పెళ్లి సందడి'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల.. తన అందం, డ్యాన్స్ లతో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెండో సినిమా 'ధమకా'తో బ్లాక్ బస్టర్ అందుకొని, డ్యాన్సింగ్ బ్యూటీగా యూత్ కి ఎంతగానో చేరువైంది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలు మొదలుకొని స్టార్ హీరోల వరకు ఎందరో సరసన నటించే అవకాశాలను శ్రీలీల దక్కించుకుంది. ఇక శ్రీలీలకి తిరుగులేదు, టాలీవుడ్ లో తదుపరి స్టార్ హీరోయిన్ తనే అనుకుంటున్న సమయంలో.. ఆమెకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి.

ఈ ఏడాది శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, అందులో 'భగవంత్ కేసరి' మినహా మిగతా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ ఏడాది 'స్కంద'తో మొదటి పరాజయాన్ని అందుకుంది శ్రీలీల. ఆ వెంటనే 'భగవంత్ కేసరి' రూపంలో ఊరట లభించింది. సినిమాతో పాటు శ్రీలీల పాత్రకి, ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 'ఆదికేశవ', 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' రూపంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి. పైగా వీటిలో శ్రీలీల పోషించిన పాత్రలు మరీ తీసికట్టుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటిదాకా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే 'భగవంత్ కేసరి' రూపంలో శ్రీలీలకు నటనకు ఆస్కారమున్న పాత్ర ఇచ్చాడు. మిగతా దర్శకులందరూ పాటలు, కొన్ని సీన్లకు పరిమితం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమెను డ్యాన్స్ ల కోసమే అన్నట్టుగా తీసుకుంటున్నారు. ఇదే కొనసాగితే శ్రీలీల ఎంత వేగంగా క్రేజ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా డౌన్ ఫాల్ చూస్తుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' పైనే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. శ్రీలీల స్పీడ్ కి బ్రేక్ లు పడకుండా ఉండాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అలాగే హీరోయిన్లను కాస్త భిన్నంగా చూపించే త్రివిక్రమ్.. ఇందులో శ్రీలీల పాత్రని నటనకు ఆస్కారం ఉండేలా రాసుకున్నాడో లేక మిగతా దర్శకుల్లాగే పాటలకు, కొన్ని సీన్లకు పరిమితం చేశాడో చూడాలి.

ఏది ఏమైనా 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్ ట్రా' తరహా రొటీన్ పాత్రలు చేస్తే మాత్రం శ్రీలీల తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇకనైనా ఆమె సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుందేమో చూద్దాం.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.