English | Telugu
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !
Updated : Dec 9, 2023
నితిన్ నటించిన తాజా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. నితిన్ పవర్ ఫుల్ యాక్టింగ్ కి తోడు శ్రీలీల అందచందాలు, డైరక్టర్ వక్కంతం వంశీ యొక్క దర్శకత్వ ప్రతిభ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ కి అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే సాధించిపెడుతుంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నితిన్ కెరీర్ లోనే వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ నైజాంలో 60 లక్షల రూపాయలని, సీడెడ్ లో 21 లక్షల రూపాయలని అలాగే ఆంధ్రాలో 70 లక్షల రూపాయలని సాధించడం జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కోటి యాభై లక్షల షేర్ ని సాధించింది. అలాగే కర్ణాటక,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షల రూపాయలని ఓవర్ సీస్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలని ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ సాధించింది.ఇలా ఓవర్ ఆల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా కలుపుకొని మొత్తం కోటి తొంబై ఆరు లక్షల షేర్ ని వసూలు చేసింది.
నితిన్ కి భీష్మ మూవీ తర్వాత సరైన విజయం రాలేదు.ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ చూసినప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా ఎంటర్ టైన్మెంట్ గా చాలా బాగుందని ముఖ్యంగా రావు రమేష్ అండ్ నితిన్ అలాగే నితిన్ రాజశేఖర్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. హీట్ దిశగా దూసుకుపోతున్న ఈ మూవీ వీకెండ్ లో మరిన్ని కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది.