English | Telugu
సంచలనం సృష్టిస్తున్న జబర్దస్ నటి వీడియో
Updated : Dec 11, 2023
ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈ టీవీ లో ప్రసారమయ్యే జబర్దస్ షో కామెడీ లెవెల్ ఏ స్థాయిలో ఉంటుందో అందరి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభని నిరూపించుకొని ఈ రోజు సినిమాల్లో కూడా నటిస్తు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ప్రారంభంలో ఈ షోలో జెంట్ ఆర్టిస్టులు మాత్రమే నటించారు. ఆ తర్వాత క్రమంగా లేడీ ఆర్టిస్టులు కూడా నటిస్తు తమదైన కామెడీతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక లేడీ ఆర్టిస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
జబర్దస్త్ షో లో తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులని విపరీతంగా నవ్వించే పవిత్ర తాను ప్రేమించిన సంతోష్ అనే వ్యక్తితో కలిసి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇటీవలే ఇద్దరికీ నిశ్చితార్ధం కూడా జరిగింది. కాకపోతే పెళ్లి డేట్ ని మాత్రం పవిత్ర ఇంకా వెల్లడి చెయ్యలేదు. తాజాగా పవిత్ర సంతోష్ లు కలిసి లోఫర్ సినిమాలోని జియా జలే అనే సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియోని పవిత్ర తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచనలం సృష్టిస్తుంది.అలాగే వీడియోని చూసిన కొంతమంది పవిత్రకి సంతోష్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నారు.
సంతోష్ మొదట పవిత్రకి తన లవ్ విషయం తెలియచేసాడు. కానీ పవిత్ర వెంటనే తన నిర్ణయం చెప్పలేదు. ఆ తర్వాత ఎన్నో రోజులకి పవిత్ర సంతోష్ లవ్ ని యాక్సెప్ట్ చేసింది. సంవత్సరం పాటు ఇద్దరు ప్రేమ పక్షులు లాగా తిరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నారు.పెళ్లి డేట్ ని మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.