English | Telugu

బిజినెస్ మాన్ తో త్రిష పెళ్లి.. హనీమూన్ షెడ్యూల్ చెప్పమంటున్న త్రిష

సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ 'త్రిష'(Trisha)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. దాదాపుగా సౌత్ లో ఉన్న అందరి అగ్రహీరోలతో జతకట్టి ఎన్నో భారీ హిట్స్ ని అందుకుంది. ఈ ఏడాది కమల్ హాసన్(Kamal Haasan),అజిత్(Ajith)ప్రీవియస్ చిత్రాలైన థగ్ లైఫ్, గుడ్ బాడ్ అగ్లీ లో అద్భుతమైన పెర్ఫార్మ్  తో  మరోసారి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. చండీగఢ్ కి చెందిన వ్యాపారవేత్తని త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మీడియా ఛానల్స్ సైతం పెళ్లిని అధికారంగా ధృవీకరిస్తూ పలు కథనాల్ని ప్రచురిస్తూ వస్తున్నాయి.

కాళ్ళు విరగ్గొడతామన్నారు.. నిహారిక అంటే అంతే మరి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న 'నిహారిక ఎన్ ఎం'(Niharika Nm)ఈ నెల 16 న విడుదల కాబోతున్న 'మిత్ర మండలి'(Mithra Mandali)అనే మూవీతో హీరోయిన్ గా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో ప్రియదర్శి(Priyadarshi)హీరో కాగా రాగ్ మయూర్, విష్ణు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. పక్కా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు(Bunny Vasu)భాను ప్రతాప నిర్మించగా, విజయేందర్ సత్తు(Vijayendhar sattu)దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలు కూడా మూవీపై మంచి ఆసక్తిని కలగచేస్తున్నాయి. నిహారిక రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు, గతంలో జరిగిన తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది.