English | Telugu

మూడ్‌ అంతా అప్‌సెట్‌ చేశాడు.. బండ్ల గణేష్‌ కామెంట్స్‌పై బన్నీవాసు!

ఇటీవలికాలంలో కాంట్రవర్సీ కామెంట్స్‌ బాగా పెరిగిపోయాయి. సోషల్‌ మీడియా వినియోగం ఎక్కువ కావడంతో ఏ చిన్న కామెంట్‌ వినిపించినా దాన్ని వైరల్‌ చేసేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు క్షణాల్లో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయిపోతున్నాయి. ఇదే అదనుగా కొందరు వివాదాస్పద వ్యక్తులు వీలున్నప్పుడల్లా ఎవరో ఒకరి మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ గురించి అందరికీ తెలిసిందే. అతను ఏ వేదిక ఎక్కినా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చెయ్యకుండా కిందకు దిగడు. ఈవెంట్‌కి బండ్ల గణేష్‌ వచ్చాడంటే సోషల్‌ మీడియాకు చేతి నిండా పనే. అలాంటి ఓ ఎపిసోడ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫంక్షన్‌లో జరిగింది. విజయ్‌ దేవరకొండ, మహేష్‌, అల్లు అరవింద్‌లను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్స్‌ చేశాడు.

లిటిల్‌ హార్ట్స్‌ హీరో మౌళికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెబుతూ, మరికొన్ని విషయాల్లో హెచ్చరిస్తూ గణేష్‌ స్పీచ్‌ కొనసాగింది. తన స్పీచ్‌ పూర్తయిన తర్వాత ఈవెంట్‌ నుంచి ఆయన వెళ్లిపోయాడు. ఆ తర్వాత బన్నీ వాసు మాట్లాడుతూ గణేశ్‌ చేసిన కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తావన వచ్చింది. దాని గురించి బన్నీ వాసు మాట్లాడుతూ ‘బండ్ల గణేష్‌ చేసిన కామెంట్స్‌ నన్నే కాదు, అందర్నీ షాక్‌కి గురి చేశాయి. అరవింద్‌గారు ఎన్నో సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఆయన గురించి కూడా అలా మాట్లాడడం బాధ అనిపించింది. ఎంతో హ్యాపీగా జరుగుతున్న ఆ ఫంక్షన్‌ అతని కామెంట్స్‌ వల్ల అందరి మూడ్‌ అప్‌సెట్‌ అయింది’ అన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం