English | Telugu

ఓటీటీలోకి  సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ హారర్-థ్రిల్లర్, థియేటర్లో మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందరికీ థియేటర్లో ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లోకి రాబోతోంది. అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుండి ‘కిష్కింధపురి’ స్ట్రీమింగ్‌కు కానుంది.

రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది. వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమైంది.

ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "నేను పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ మేం మాత్రం ఊహించుకుని అలా నటించాల్సి వస్తుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకు వచ్చినట్టు అయింది. సెట్‌లో నేను నిరంతరం భయం, అనిశ్చితి వాతావరణంలో జీవించాల్సి వచ్చింది. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "కిష్కింధపురి’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కింది. ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదు. కొన్ని సార్లు భయపడుతుంది, ఇంకొన్ని సార్లు కృంగిపోతుంది.. మరి కొన్ని సార్లు తనని తాను ప్రశ్నించుకుంటుంది.. మళ్లీ వెంటనే రెట్టింపు శక్తితో పైకి లేస్తుంది.. నా పాత్రకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నాకు, ఆ వెంటాడే ప్రదేశాలలో షూటింగ్ అనేది ఒక వింతైన అనుభవం. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనల్ని మన పాత్రల్లోకి లోతుగా నెట్టివేస్తున్నట్లు అనిపించింది" అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.