దేవర రికార్డుని టచ్ చేయలేకపోతున్న స్టార్స్!
స్టార్ హీరోల సినిమాలు భారీ బిజినెస్ చేస్తుంటాయి. దీంతో ఓవరాల్ గా హిట్ అనిపించుకున్న సినిమాలు కూడా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇలా ఎనిమిది ఏరియాలుగా బిజినెస్ జరుగుతుంది. అయితే కోవిడ్ తర్వాత ఈ ఎనిమిది ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించిన బడా సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి.