English | Telugu

విఎఫ్ఎక్స్ లో గడ్డం తీసేస్తామన్నారు.. ఆ సినిమా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు

 యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)'తండేల్' తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చైతన్య కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా కూడా తండేల్ నిలిచింది. పైగా తన గత చిత్రాల కంటే తండేల్ లో నటన పరంగా, యాక్షన్ సీక్వెన్స్ లోను చైతన్య విజృంభించి నటించాడు. ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' మూవీ ఫేమ్ 'కార్తీక్ దండు'(Karthik Dandu)దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ 'మైథలాజికల్ థ్రిల్లర్' గా తెరకెక్కుతుండటంతో, చైతన్య క్యారక్టర్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఆటో నుండి ఆడి కార్ వరకు.. రిషబ్ శెట్టి ఇన్స్పైరింగ్ జర్నీ

హీరోగా కేవలం రెండే రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడమంటే సామాన్యమైన విషయం కాదు. పైగా దర్శకుడుగా కూడా ఆ రెండు చిత్రాలతో ఇండియన్ సినిమా మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు రిషబ్ శెట్టి. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా 'కాంతార చాప్టర్ 1 'తో తన రికార్డుల వేటని కొనసాగిస్తున్నాడు. బడా హీరోలు సైతం ఆశ్చర్యపోయే రీతిలో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. మూవీ చేసిన ప్రతి ఒక్కరు రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్సు కి మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రిషబ్ శెట్టి గురించి చర్చ నడుస్తుంది.