English | Telugu

‘రాజా సాబ్‌’ సాంగ్‌ వీడియో లీక్‌.. అదరగొడుతున్న ప్రభాస్‌ మాస్‌ లుక్‌!

ప్రభాస్‌ లాస్ట్‌ మూవీ ‘కల్కి 2898ఎడి’ చిత్రం విడుదలై ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి మారుతి డైరెక్షన్‌లో చేస్తున్న ‘రాజా సాబ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాకి భారీ హైప్‌ని తీసుకొచ్చింది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. సినిమా రిలీజ్‌ ముందు మరో ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. ట్రైలర్‌ చూసిన తర్వాత ఇది హారర్‌ థ్రిల్లర్‌ అని అర్థమవుతోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ, సినిమాకి సంబంధించిన వర్క్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉండడంతో జనవరి 9కి వాయిదా వేశారు. ఈ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశ పడినప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తమ హీరో సినిమా రావడం వారికి సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. ఈ సాంగ్‌ మేకింగ్‌కి సంబంధించిన వీడియో లీక్‌ అయింది. రెడ్‌ షర్ట్‌ వేసుకొని తలపాగా చుట్టుకున్న ప్రభాస్‌.. డాన్స్‌ మూమెంట్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. పూర్తి మాస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ని చూసి ఫ్యాన్స్‌ ఎంతో హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. ఇటీవలికాలంలో ప్రభాస్‌ ఈ తరహా లుక్‌లో కనిపించడం, స్టెప్స్‌ వేయడం జరగలేదు. ఈ సినిమాలోని పాటతో ప్రేక్షకులకు, అభిమానులకు తన స్టెప్స్‌తో కనువిందు చేయబోతున్నారు ప్రభాస్‌. లీక్‌ అయిన ఈ సాంగ్‌ మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.