English | Telugu

ఆ నాలుగు సినిమాల్లో దీపావళి విన్నర్‌గా నిలిచే మూవీ ఏది?

టాలీవుడ్‌కి సెప్టెంబర్‌ నెల బాగా కలిసొచ్చింది. లిటిల్‌ హార్ట్స్‌, మిరాయ్‌, ఓజీ చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. మిరాయ్‌తోపాటు రిలీజ్‌ అయిన కిష్కింధపురి కూడా కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు అనిపించింది. చాలా కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడుతున్నాయి. అక్టోబర్‌కి వచ్చేసరికి కాంతార చాప్టర్‌ 1 కలెక్షన్ల పరంపరను కొనసాగించింది. అయితే సెప్టెంబర్‌లో సక్సెస్‌ అయిన నాలుగు సినిమాలూ తెలుగు సినిమాలు కావడం విశేషం. అక్టోబర్‌కి వచ్చేసరికి కాంతార డబ్బింగ్‌ సినిమా. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ సినిమాకి పోటీగా నిలిచే సినిమా రెండో వారంలో లేకపోవడం కూడా కాంతారకు కలిసొచ్చింది.

మూడో వారంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్‌ 20 దీపావళి కావడంతో పండగను టార్గెట్‌ చేస్తూ ఈ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయితే ప్రధానంగా నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. 16న ‘మిత్రమండలి’, 17న ‘తెలుసు కదా’, ‘డ్యూడ్‌’, 18న ‘కె ర్యాంప్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల ట్రైలర్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిన సినిమాలు. పైగా పండగకి రిలీజ్‌ అవుతున్న సినిమాలు కావడంతో ఈ నెలలో కూడా థియేటర్లలో సందడి వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

అక్టోబర్‌ 16న విడుదలవుతున్న మిత్రమండలి చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌, సత్య, నిహారిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక మంచి బజ్‌ వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ప్రేక్షకులు ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన తెలుసు కదా అక్టోబర్‌ 17న రిలీజ్‌ అవుతోంది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే ఉంటుందని అర్థమవుతోంది. అదే రోజు ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, మమిత బైజు హీరోయిన్‌గా రూపొందిన డ్యూడ్‌ చిత్రం కూడా విడుదలవుతోంది. గతంలో లవ్‌ టుడే, డ్రాగన్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రదీప్‌ నటించిన ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉంది.

ఇక 18న కిరణ్‌ అబ్బవరం కెర్యాంప్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా కూడా యూత్‌ని టార్గెట్‌ చేసి రూపొందించారు. ప్రజెంట్‌ జనరేషన్‌ కుర్రాళ్లకు కావాల్సిన కంటెంట్‌ అంతా ఈ సినిమాలో ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే దీపావళికి రిలీజ్‌ అవుతున్న నాలుగు సినిమాలూ ఒకే తరహాలో నాన్‌స్టాప్‌ కామెడీ మూవీస్‌గా కనిపిస్తున్నాయి. ఒకేసారి ఒకే తరహా సినిమాలు నాలుగు రావడం కూడా ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. ఏ సినిమా ముందు చూడాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి రావడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఈ నాలుగు సినిమాల్లో దీపావళి విన్నర్‌ ఎవరు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం