English | Telugu

యష్మీ చేసిన తప్పుకి క్షమాపణ కోరిన తండ్రి.. 

బిగ్ బాస్ పదకొండవ వారంలో గేమ్స్ ఏమీ లేవు.. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ వీక్ లో హౌస్ లోని వాళ్ళ అమ్మ, నాన్న, భార్య ఇలా ఎవరో ఒకరు వస్తుంటారు. ఇది మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. అయితే హౌస్ లోకి మొదటగా నబీల్ వాల్ల అమ్మ వచ్చింది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ ఫాదర్ వచ్చాడు. యష్మీ తనని చూసి ఎమోషనల్ అవుతుంది. హౌస్ మొత్తం ఫ్ర్రీజ్ కాగా యష్మీ ఫాదర్ ఎంట్రీ ఇస్తాడు.

తనని చూసి అవినాష్, తేజలు ఏదో ఆఫీసర్ లాగా వున్నాడు భయమేస్తుందని అనుకుంటారు. ఆ తర్వాత అతను రావడంతోనే నిఖిల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అది చూసి నిఖిల్ చూడు రాగానే కాళ్ళ పై పడుతున్నాడని అవినాష్ తో రోహిణి అంటుంది. మగలే.. మై వారియర్ అనగానే యష్మీ మురిసిపోతుంది. ఇక యష్మీ తో వాళ్ళ నాన్న పర్సనల్ గా మాట్లాడుతూ.. ముందు ఆడినట్టు ఆడడం లేదు.. ఇండివిడ్యువల్ గా ఆడు.. గ్రూప్ గేమ్ వద్దు.. బయట బ్యాడ్ అవుతున్నావ్.. ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. నీలా నువ్వు ఉంటే గెలుస్తావని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దాంతో యష్మీ అర్ధం అయింది ఇక నుండి అలాగే ఆడతానని అంటుంది.

ఆ తర్వాత యష్మీ వాళ్ళ నాన్న అందరి దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. తేజ తన ఫ్యామిలీని మిస్ అవుతూ ఎమోషనల్ అవుతాడు. మీరు పర్మిషన్ ఇస్తే బిగ్ బాస్ నా కూతురి కి భోజనం తినిపిస్తానని యష్మీ ఫాదర్ అంటాడు. యష్మీ కి భోజనం తినిపిస్తాడు. ఇక హౌస్ అందరికి యష్మీ తరుపున సారీ అడుగుతాడు. తను చేసిన తప్పులకి నేను క్షమించమని అడుగుతున్నాను.. అందరు కలిసి ఉండండి అంటు యష్మీ వాళ్ల నాన్న అందరితో అంటాడు. ఇక సరదాగా మాట్లాడి.. బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ రాగానే వెళ్ళిపోతాడు. మా నాన్న అసలు ఎప్పుడు ఇలా లేడని యష్మీ ఎమోషనల్ అవుతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.